కరోనా మహమ్మారిపై విజయం సాధించడానికి ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. తాజా గణాంకాల ప్రకారం కూడా ఒమిక్రాన్ బారినపడి పరిస్థితి సీరియస్‌గా అయినవారిలో ఎక్కువ మంది వ్యాక్సిన్ తీసుకోనివారే.. అంటే.. వ్యాక్సిన్ రోగ నిరోధక శక్తిని ఏ స్థాయిలో పెంచుతుందో అర్థం చేసుకోవచ్చు.. ఇక, కోవిడ్‌పై పోరాటంలో భాగంగా.. మొదట దేశీయంగా తయారైన రెండో వ్యాక్సిన్లకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.. ఆ తర్వాత ప్రభుత్వమే కొని వాటిని రాష్ట్రాలకు సరఫరా చేస్తోంది.. మరికొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు, సంస్థలకు అమ్ముకునే అవకాశం కూడా ఇచ్చారు.. ఇక, కొవిడ్ వ్యాక్సిన్‌లు త్వరలో రెగ్యులర్ మార్కెట్‌లోకి అడుగుపెట్టబోతున్నాయి.. ఇదే సమయంలో వ్యాక్సిన్ల ధరలు భారీగా తగ్గుతాయని కథనాలు వస్తున్నాయి..
Read Also: బీజేపీ ప్లాన్‌ను వైసీపీ అమలుచేస్తోంది.. అందుకే కొత్త జిల్లాలు..!
దేశీయంగా తయారైన కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లకు డ్రగ్ నియంత్రణ విభాగం నుంచి అప్రూవల్ దక్కిన వెంటనే.. ఆ టీకాలు మార్కెట్‌లోకి రిలీజ్ చేసేందుకు సిద్ధమైన ఆ సంస్థలు.. ఇదే సమయంలో ఓ శుభవార్త కూడా చెబుతున్నాయి.. రెగ్యులర్ మార్కెట్‌లోకి వచ్చిన వెంటనే రెండు వ్యాక్సిన్ల ధరలు భారీగా తగ్గనున్నట్లు తెలుస్తోంది.. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఈ రెండు వ్యాక్సిన్ల ధరలు ఒక్కో డోసు రూ. 275గా ఫిక్స్ చేయనున్నారట.. దీనికి సర్వీస్ ఛార్జీ మరో 150 రూపాయలు అదనం.. అంటే.. మొత్తంగా రూ. 425కు సింగిల్ డోస్ టీకా లభించవచ్చునని ఆ కథనాల సారాంశం.. ఇదే జరిగితే వ్యాక్సిన్ల ధర భారీగా తగ్గినట్టే.. ఎందుకంటే.. ప్రస్తుతం ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్లలో కోవాగ్జిన్ ధర డోసుకు రూ.1,200గా ఉంది.. అదే కోవిషీల్డ్ వ్యాక్సిన్ డోసుకు రూ. 780గా ఉంది.. ఇక, వీటికి అదనంగా రూ. 150 సర్వీస్ ఛార్జీలు చెల్లించి వ్యాక్సిన్ పొందుతున్నారు.. అయితే, వ్యాక్సిన్ల ధర భారీగా తగ్గించేందుకు నేషనల్ ఫార్మాసుటికల్స్ ప్రైసింగ్ అథారిటీ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం..
