Site icon NTV Telugu

కోవీషీల్డ్ వేయించుకుంటేనే… ఆ దేశంలోకి అనుమ‌తి…

క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి బ‌య‌ట‌ప‌డాలి అంటే వ్యాక్సిన్ తీసుకోవ‌డం త‌ప్ప‌నిసరి అన్న విష‌యం తెలిసిందే.  ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు అన్ని దేశాల్లో వ్యాక్సిన్ వేస్తున్నారు.  క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతుండ‌టంతో ప్ర‌పంచ ప‌ర్యాట‌కుల‌కు దేశాలు స్వాగ‌తం ప‌లుకుతున్నాయి.  అయితే, ఒక్కోదేశం ఒక్కోదేశానికి ఒక్కోవిధంగా నిబంధ‌న‌లు విధిస్తున్న‌ది.  ఈ నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే న‌డుచుకోవాలి.  ఇండియా నుంచి వ‌చ్చే పర్యాట‌కులకు కొన్ని నిబంధన‌లు విధించాయి.

Read: మళ్లీ తెరపైకి థర్డ్‌ ఫ్రంట్..! మోడీని ఢీకొట్టే నేత కోసం వేట..?

మారిషస్‌లో  జులై 15 నుంచి ప‌ర్యాట‌కుల‌కు స్వాగతం ప‌లుకుతున్నారు.  వ్యాక్సినేష‌న్ త‌ప్ప‌నిస‌రి.  18 ఏళ్లు నిండిన‌వారైతే రెండు డోసుల‌ను వేయించుకొని ఉండాలి.  మారిష‌ష్ కు వ‌చ్చే వారం రోజుల‌ముందు ఆర్టీపీసీఆర్ టెస్టు త‌ప్ప‌నిస‌రి.  అదేవిధంగా, మారిష‌స్‌కు వ‌చ్చిన త‌రువాత 7,14 రోజుల్లో రెండుసార్లు టెస్టులు చేయించుకోవాలి.  ఐరపా దేశాల‌కు వెళ్లాలి అంటే త‌ప్ప‌నిస‌రిగా వ్యాక్సిన్ తీసుకోవాల్సినందే.  ఐస్‌ల్యాండ్ దేశంలోకి అడుగుపెట్టాలి అంటే భార‌తీయులు త‌ప్ప‌నిసరిగా కోవీషీల్డ్ వ్యాక్సిన్ తీసుకొని ఉండాల‌ని ష‌ర‌తు పెట్టింది. 

Exit mobile version