Site icon NTV Telugu

ముంబైలోని ఆ ఆల‌యంలో క‌రోనా టీకాలు…

మ‌హారాష్ట్ర కరోనా నుంచి ఇప్పుడిప్పుడే బ‌య‌ట‌ప‌డుతోంది.  క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు ఎక్కువ‌గా మ‌హారాష్ట్ర‌లోనే న‌మోద‌య్యాయి.  మహారాష్ట్ర‌లో వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం వేగంగా సాగుతున్న‌ది.  ప్ర‌భుత్వ, ప్రైవేట్ ఆసుప‌త్రుల‌తో పాటుగా కొన్ని స్వ‌చ్చంద సేవాసంస్థ‌లు, దేవాల‌య ట్ర‌స్ట్‌లు కూడా వ్యాక్సిన్‌ను అందిస్తున్నాయి.  ముంబైలోని జైన దేవాల‌యంలో ఎలాంటి గుర్తింపు కార్డులు లేని యాచ‌కులు, పేదలు, వీధి వ్యాపారుల‌కు వ్యాక్సిన్‌ను అందిస్తున్నారు.  టీకాల‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తు, వ్యాక్సిన్ అందిస్తున్న‌ట్టు ఆల‌య అధికారులు చెబుతున్నారు.  ఆల‌యంలో వేస్తున్న టీకాకు మంచి రెస్పాన్స్ వ‌స్తున్న‌ది.  

Exit mobile version