NTV Telugu Site icon

Uttarapradesh : దారుణం..యూపీలో మైనర్ దళిత బాలికపై అత్యాచారం..

Rape

Rape

Kaushambi: మహిళల పై ఎన్నో రకాల అఘాత్యాలు జరుగుతూనే ఉన్నాయి.. ప్రభుత్వం కూడా కఠినమైన శిక్షలు అమలు చేస్తున్నా కూడా కామాంధుల లో మార్పులు మాత్రం రాలేదు.. అంతకు అంత పెరుగుతున్నాయి.. ఇక దేశంలో చిన్నారులపై అత్యాచారాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ లో మరో కేసు వెలుగు చూసింది.. ఓ కీచకుడు అభం, శుభం తెలియని 15 ఏళ్ల మైనర్ బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదు అందింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన తో జనాలు ఉలిక్కి పడ్డారు.. అతన్ని వెంటనే ఉరి తియ్యాలని డిమాండ్ చేస్తున్నారు… వివరాల్లోకి వెళితే..

రాష్ట్రంలోని కౌశంబీ లో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది.. స్థానికంగా నివాసం ఉంటున్న 15 ఏళ్ల దళిత బాలికపై ఓ వ్యక్తి నాలుగు నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు బుధవారం తెలిపారు.. బాధితురాలైన అదే గ్రామానికి చెందిన 20 ఏళ్ల నిందితుడు బాలికపై ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి గత నాలుగు నెలలుగా అత్యాచారం చేశాడని పోలీసు సూపరింటెండెంట్ బ్రిజేష్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు..

బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు నిందితుడిపై ఐపీసీ అత్యాచారం, పోక్సో చట్టం, ఎస్సీ/ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితుడు పరారీలో ఉన్నాడని, రహస్య స్థావరాలపై దాడులు నిర్వహిస్తున్నామని, త్వరలో అరెస్టు చేస్తామని తెలిపారు. బాలికను వైద్య పరీక్షలకు పంపనున్నారు. విచారణ జరిపి తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన పై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.. ఈ ఘటన పై పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు..