Site icon NTV Telugu

Uttarakhand Tunnel Incident: టన్నెల్లో 17 రోజులు.. ఇలా టైంపాస్ చేశాం

Uttarakhand

Uttarakhand

Uttarakhand Tunnel Rescue: ఉత్తరాకాశీ టన్నెల్ ఘటన అఖరికి సుఖాంతమైన సంగతి తెలిసిందే. టన్నెల్లో చిక్కుకున్న 41 మంది కార్మికులు అతి కష్టం మీద బయటపడ్డారు. రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ కావడంతో వారంత ప్రాణాలతో బయటపడ్డారు. అయితే దాదాపు 17 రోజుల పాటు టన్నెల్లోనే చిక్కుకున్న 41 మంది కార్మికులు బయటకు వచ్చాక తమ అనుభవనాలను పంచుకుంటున్నారు. కొందరు చావు అంచుల వరకు వెళ్లోచ్చామంటూ ఉలిక్కిపడ్డారు. 17 రోజల పాటు చావును దగ్గరగా చూశాం.. ఏం జరుగుతుందనే భయంతో గడిపాం.. ప్రతి క్షణం కాపాడమంటూ మనసులోనే దేవుడిని వేడుకున్నామంటూ ఒక్కొక్కరుగా తమ అనుభవాలను చెబుతున్నారు.

Also Read: Fire Ants: స్కైడైవింగ్ చేస్తూ 14 వేల అడుగుల నుంచి కింద పడిన మహిళ.. కాపాడిన అగ్ని చీమలు

అయితే యూపీలోని మోతీపూర్‌కు చెందిన అంకిత్ మాత్రం ఆసక్తికర విషయాలు చెప్పాడు. 17 రోజుల పాటు టన్నెల్లో ఎలా టైంపాస్ చేశారో వివరించాడు. ‘17 రోజులు టన్నెల్లో మేమంతా రోజులు లెక్కబెట్టుకున్నాం. కానీ దాని నుంచి బయటపడేందుకు చిన్నప్పటి ఆటలు ఆడుకుంటూ టైంపాస్ చేశాం. రాజా, మంత్రి.. చోర్ సిపాయి లాంటి ఆటలు ఆడుకున్నాం. టన్నెల్ చాలా పొడవు ఉండటంతో ఎక్కువగా వాకింగ్ చేసేవాళ్లం’ అంటూ చెప్పుకొచ్చాడు. అదే సమయంలో కటుుంబ సభ్యులు గుర్తోచ్చినప్పుడు మాత్రం కంగారుగా అనిపించేందు. కనీసం వాళ్లతో మాట్లాడే అవకాశం కూడా లేకపోవడం. ఎలా ఉన్నారో.. ఏం చేస్తున్నారో అనే దిగులు ఉండేది’ అని అంకిత్ అన్నాడు.

Also Read: Sandra Venkata Veeraiah: నూటికి నూరు శాతం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతారు..

Exit mobile version