NTV Telugu Site icon

Uttarakhand Tunnel Collapse: ఉత్తరాఖండ్‌ ఘటన.. మూడో రోజు కూడా కొనసాగతున్న సహాయక చర్యలు

Uttarkhand Tunnel Collaspse

Uttarkhand Tunnel Collaspse

Uttarakhand Tunnel Collapse Update: ఉత్తరాఖండ్ టెన్నెల్ వద్ద సహాయక చర్యలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో మంగళవారం భారీ డయామీటర్ పైపులు, డ్రిల్లింగ్ యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఆదివారం ఉత్తరకాశీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో కొంతభాగం ఆకస్మాత్తుగా కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో దాదాపు 40 మంది కార్మికులు చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు రెండు రోజులుగా సహాయక బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి. ఆదివారం రాత్రి నుంచే 900 మిల్లీమీటర్ల వ్యాసం పైపులతో కూడిన ట్రక్కులు సిల్కీయారాకు రావడం ప్రారంభించాయి.

Also Read: Asaduddin Owaisi: నువ్వు ఆర్‌ఎస్‌ఎస్ కీలుబొమ్మవి.. బీజేపీ- కాంగ్రెస్‌ల మధ్య ఎలాంటి తేడా లేదు

తాజాగా భారీ డ్రిల్లింగ్ మిషన్ కూడా చేరుకోవడం సహాయక చర్యలు మరింత వేగవంతం అయ్యాయి. చిక్కుకున్న కార్మికులను వెలికి తీసేందుకు వీలుగా శిథిలాల మధ్య పెద్ద వ్యాసం కలిగిన ఎంఎస్ పైపులను చొప్పించడానికి ఒక యంత్రాన్ని సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. చిక్కుకున్న 40 మంది కార్మికుల ప్రదేశానికి చేరుకోవడానికి ఇంకా 35 మీటర్ల శిథిలాలను తొలగించాల్సి ఉందని సహాయక బృందాలు తెలిపాయి. కాగా ఈ సహాయక చర్యలను ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఈ ఘటనపై స్పందించారు. చిక్కుకున్న వారిని క్షేమంగా బయటకు తీసేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నామన్నారు.

Also Read: Gautam Singhania: భార్యతో విడిపోయిన రేమండ్ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ సింఘానియా.. కారణం ఏంటంటే?

హాయక చర్యల కోసం హరిద్వార్, డెహ్రాడూన్ నుంచి పెద్ద డయామీటర్ హ్యూమ్ పైపులను పంపేందుకు ఏర్పాట్లు చేసినట్లు ధామి తెలిపారు. ఘటన చిక్కుకున్న 40 మంది కార్మికులు యోగ క్షేమాల గురించి తెలుసుకునేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఫోన్ చేశారని, అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారని ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు. ఇదిలా ఉంటే 60 మీటర్ల శిథిలాల్లో 20 మీటర్లకు పైగా శిథిలాలను తొలగించామని, ఈ రోజు రాత్రి వరకు లోపల చిక్కుకున్న 40 మందిని బయటకు తీస్తామని ఉత్తరకాశీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) అర్పన్ యదువంశీ చెప్పారు. వారికి ఆక్సిజన్, ఆహారం, నీరు సహా అన్ని మౌలిక సదుపాయాలను పైపుల ద్వారా కల్పిస్తున్నారని, వారి కుటుంబ సభ్యులను కూడా సంప్రదించామని తెలిపారు.