NTV Telugu Site icon

Uttarakhand: హిమపాతంలో చిక్కుకున్న 28 మంది.. పలువురి మృతి..?

Himalayas

Himalayas

Uttarakhand Avalanche Incident: ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం సంభవించింది. హిమాలయాల్లో పర్వతారోహనకు వెళ్లిన 28 మంది హిమపాతంలో చిక్కుకున్నారు. నెహ్రూ మౌంటెనీరింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో 28 మంది ట్రైనీ పర్వతారోహకులు చిక్కుకుపోయారని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి తెలిపారు. ఇందులో 20 మంది వరకు మరణించినట్లు సమాచారం. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఐటీబీటీకి చెందిన బలగాలు సంఘటనా స్థలానికి చేరుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. సహాయక, రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నట్లు సీఎం వెల్లడించారు. ద్రౌపది దండ-2 శిఖరం వద్ద ఈ ప్రమాదం జరిగింది.

హిమపాతంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సహస్రధార హెలిప్యాడ్ నుంచి బయలుదేరాయి. ఈ ప్రమాదంపై ఉత్తరాఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ట్వీట్ చేశారు. 28 మంది పర్వతారోహకులు హిమపాతంలో చిక్కుకున్నట్లు వెల్లడించారు. సైన్యం సహాయసహకారం కోసం కేంద్ర రక్షణ శాఖ మంత్రిని కోరామని.. అందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు పుష్కర్ సింగ్ ధామి వెల్లడించారు.

ఉత్తరాఖండ్ లోని హిమాలయాల్లో విపరీతంగా మంచు కురుస్తోంది. శీతాకాలం సమీపిస్తున్న తరుణంలో పితోర్ గఢ్ ప్రాంతంలో హిమాలయాల్లో మంచు కురుస్తోంది. దర్మా లోయలో చైనా సరిహద్దుకు సమీపంలో లోతట్టు ప్రాంతాల్లో సుమారు 1 అడుగు మేర మంచు కురుస్తోంది. అదే విధంగా 17,500 అడుగుల ఎత్తులో ఉన్న పర్వతాల్లో నాలుగు అడుగుల మేర మంచు కురస్తోంది.

శీతాకాలం సమీపిస్తున్న తరుణంలో దర్మాలోయిలోని 14 గ్రామాలు, బియాస్ లోయలోని ఏడు గ్రామాల ప్రభావితం అవుతాయి. ఈ రెండు గ్రామాల్లోని ప్రజలు నవంబర్ మొదటి వారంల నుంచి లోయ దిగువకు వస్తారని భావిస్తున్నారు. అక్టోబర్ 2న దిగువ లోయలో వర్షం కారణంగా జ్యోలికాంగ్, నాభిధాంగ్, ఓం పర్వతం, ఆది కౌలాష్, బియస్ లోయలోని పంచచూలి శిఖరంపై హిమపాతం సంభవించింది.  విపరీతమైన మంచు ప్రభావం వల్ల అవలాంచ్ ఏర్పడి 28 మంది చిక్కకున్నారు. ప్రస్తుతం వీరందరిని రక్షించే ప్రయత్నం జరుగుతోంది.