NTV Telugu Site icon

Uttarakhand Avalanche: హిమపాతం ప్రమాదంలో 26కు చేరిన మృతుల సంఖ్య..

Uttarakhand Avalanche

Uttarakhand Avalanche

Uttarakhand avalanche-Death toll climbs to 26: పర్వతారోహణ విషాదంగా మారింది. ఉత్తరాఖండ్ హిమపాతం సంఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు మొత్తం 26 మంది మరణించారు. మరో ముగ్గురు ఆచూకీ ఇంకా తెలియాల్సి ఉంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ ద్వారా శనివారం మరో ఏడు మృతదేహాలను తీసుకువచ్చారు. అక్టోబర్ 4న భారీ హిమపాతం సంభవించడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. అప్పటి నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఇండో-టిబెటన్ బార్డర్ పోలీస్(ఐటీబీపీ) రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొంటున్నారు.

Read Also: Pakistan: పాక్ ప్రభుత్వానికి షాక్.. స్వాత్ లోయలో ప్రజల నిరసనలు

అక్టోబర్ 4న ద్రౌపది కా దండ-2 శిఖారాన్ని అధిరోహిస్తున్న క్రమంలో పర్వతారోహకులు బృందంపై మంచు విరుచుకుపడింది. ఈ బృందం కిందికి తిరిగి వస్తుండగా 17,000 అడుగుల ఎత్తులో ప్రమాదం సంభవించింది. ఉత్తరకాశీలోని నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మౌంటెనీరింగ్‌కు చెందిన పర్వతారోహకుల బృందం ఈ ప్రమాదం బారిన పడింది. మంచులో కూరుకుపోవడం, అత్యంత శీతల పరిస్థితుల్లో చిక్కుకోవడంతో చాలా మంది మరణించారు. శిక్షకులతో పాటు పర్వతారోహణలో శిక్షణ తీసుకుంటున్నవారు మరణించారు.

వాతావరణ పరిస్థితులు కూడా రెస్క్యూ ఆపరేషన్ కు ఆటంకం కలిగిస్తున్నాయి. ప్రస్తుతం ఇంకా తప్పిపోయిన మరో ముగ్గురికోసం అన్వేషణ కొనసాగుతోంది. చలికాలం దగ్గరికి రావడంతో ఉత్తరాఖండ్ హిమాలయాల్లో మంచుతీవ్రత పెరుగుతోంది. మంచు, వర్షం పరిస్థితుల మధ్య పర్వతారోహణ, టెక్కింగ్  కొన్ని రోజుల పాటు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.