Site icon NTV Telugu

Yogi Sarkar : యూపీ అలర్ల సూత్రధారికి.. ‘బుల్డోజర్‌’నోటీసులు

Up Clash

Up Clash

మాజీ బీజేపీ నేతలు నుపుర్ శర్మ, నవీన్‌ కుమార్‌ జిందల్‌లు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగానే కాకుండా.. ముస్లిం దేశాలలో కూడా ఆగ్రహజ్వాలలు రగిల్చిన సంగతి తెలిసిందే. అయితే.. మహమ్మద్ ప్రవక్తపై వ్యాఖ్యలకు వ్యతిరేకంగా యూపీలోని ప్రయాగ్ రాజ్ లో ముస్లింలు పెద్ద ఎత్తున నిరసన, అల్లర్లకు పాల్పడ్డారు. అయితే దీని వెనుక ప్రధాన సూత్రధారి అయిన మహమ్మద్ జావెద్ అలియాస్ జావెద్ పంప్‌కు ప్రయాగ్ రాజ్ డెవలప్ మెంట్ అథారిటీ నోటీసు జారీ చేసింది.

శుక్రవారం పట్టణంలో జరిగిన అల్లర్ల వెనుక అతడి ప్రధాన పాత్ర ఉన్నట్టు పోలీసులు ఇప్పటికే తేల్చారు. దీంతో ప్రయాగ్ రాజ్ పట్టణ అభివృద్ధి మండలి నోటీసులు జారీ చేయడం గమనార్హం. పట్టణంలోని అతల ప్రాంతంలో జావెద్ ఇంటి గేటుకు అధికారులు నోటీసు అంటించి వెళ్లారు.

శనివారం ఉదయం 11 గంటల వరకు ఇల్లు ఖాళీ చేయాలని అందులో పేర్కొన్నారు. ఇంటిని అక్రమంగా నిర్మించినట్టు.. ఎటువంటి ముందస్తు అనుమతులు తీసుకోలేదని నోటీసులో ఉంది. దీంతో పలు చట్ట నిబంధనలను ఉల్లంఘించినట్టు తేల్చింది. ఈ ఏడాది మే5న జారీ చేసిన షోకాజు నోటీసుకు జావెద్ నుంచి ఎటువంటి స్పందన లేదని, ఇంటిని ఖాళీ చేయలేదని ప్రయాగ్ రాజ్ డెవలప్ మెంట్ అథారిటీ పేర్కొంది. దీంతో జూన్ 9న మరో నోటీసు జారీ చేస్తున్నట్టు తెలిపింది ప్రయాగ్ రాజ్ డెవలప్ మెంట్ అథారిటీ.

 

Exit mobile version