Uttar Pradesh Political Crisis: ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో చరిత్ర సృష్టిస్తూ ఎప్పుడూ జరగని విధంగా రెండో సారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరోసారి యోగి ఆదిత్యనాథ్ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు. తనదైన శైలిలో పాలన సాగిస్తున్నారు. అల్లర్లు, నేరాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఇన్నాళ్లు స్తబ్ధుగా ఉన్న యోగీ ప్రభుత్వంలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. యోగీ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తాకింది. ఏకంగా ఓ క్యాబినెట్ మంత్రి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు పంపారు. మరో మంత్రి జితిన్ ప్రసాద కూడా రాజీనామాకు సిద్ధమైనట్లు.. సీఎం యోగీపై ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.
యూపీ మంత్రి దినేష్ ఖటిక్ తన రాజీనామా లేఖను అమిత్ షాకు పంపారు. నిజానికి బీజేపీ ప్రభుత్వాల్లో అసంతృప్తి బయటపడటం చాలా అరుదు. ఏకంగా ఓ మంత్రి రాజీనామా చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరూ కూడా ఢిల్లీలో కేంద్ర నాయకత్వంలో సమావేశం అయ్యారు. ఉత్తర్ ప్రదేశ్ కేబినెట్ లో దినేష్ ఖటిక్ జలవనరుల శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే ఇటీవల సీఎం తనను అవమానిస్తున్నారనే కారణంగా రాజీనామా చేసినట్లు తెలుస్తోెంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తనకు వంద రోజులుగా ఎలాంటి పనులు అప్పగించలేదని ఆయన అసంతృప్తి వ్యక్తపరిచారు. తన శాఖలో అవినీతి జరిగిందని ఆరోపిస్తూన్నారు ఖటిక్.
Read Also: Somireddy Chandramohan Reddy: పోలవరం మీద తెలంగాణేకాదు ఢిల్లీ దిగివచ్చినా కుదరదు..!
నేను దళితుడిని కాబట్టే నాకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని.. మంత్రిగా తనకు అధికారం లేనది.. నేను రాష్ట్ర మంత్రిగా పనిచేయడం ద్వారా దళిత వర్గానికి ఎలాంటి ఉపయోగం లేదని..నన్ను ఏ సమావేశానికి పలవడం లేదని.. ఈ పరిణామాలు నన్ను బాధపెట్టడం వల్లే రాజీనామా చేస్తున్నానని ఖటిక్ లేఖ రాశారు. ఇదిలా ఉంటే జితిన్ ప్రసాద పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్నారు. అయితే ఈ శాఖ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటోంది. దీంతో ముఖ్యమంత్రి కార్యాలయం విచారణకు ఆదేశించిందని.. తన టీంలో ఓ అధికారిని ముఖ్యమంత్రి సస్పెండ్ చేయడంపై జితిన్ ప్రసాద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిపార్ట్మెంట్ బదిలీల్లో తీవ్ర అవకతవకలకు పాల్పడిన ఐదుగురు సీనియర్ అధికారులను మంగళవారం యూపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ పరిణామాలతో జితిన్ ప్రసాద ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. జితిన్ ప్రసాద కొందరి అధికారుల బదిలీలు, పోస్టింగుల కోసం లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ గతేడాది ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి చేరారు.
