సాధారణంగా ఉద్యోగం చేసే మహిళలైనా.. పురుషులైనా ..వారికి ఉండే వర్క్ ప్రెషర్ తో ఇబ్బందులు పడుతుంటారు. అలాంటిది ఓ మహిళా కండక్టర్ మాత్రం ఎలాంటి ప్రెషర్ లేకుండా.. హ్యాపీగా తన చంటి బిడ్డను చంకన వేసుకుని మరీ డ్యూటీ చేస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Read Also: AI-Created: నీటిపై నడుస్తూ.. గాల్లో ఎగిరే షూస్ మీరు ఎప్పుడైనా చూశారా..చూడకపోతే ఓ లుక్కేయండి
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ రోడ్‌వేస్‌లో ఆమె ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు తన బిడ్డతో ఇంటి నుండి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటల వరకు తన డ్యూటీని పూర్తి చేస్తుంది. మహిళా కండక్టర్‌గా పనిచేస్తున్న నిధి తివారీ తన ఏడాది వయసున్న కొడుకును ఛాతీకి స్కార్ఫ్‌తో కట్టుకుని ప్రయాణీకులకు టిక్కెట్లు ఇస్తుంది. అయితే బస్సులో ఇది చూసిన వాళ్లంతా ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే ఆమె ఒరై డిపోలో పనిచేస్తూ.. ఝాన్సీకి వెళుతున్న బస్సులో కండక్టర్ గా విధులు నిర్వహిస్తుంది. నిధి భర్త మోహిత్ ఒక ఈ-రిక్షా డిస్ట్రిబ్యూటర్ వద్ద పనిచేస్తున్నాడు. వారిది ప్రేమ వివాహం, ఇప్పుడు ఏడాది వయసున్న కుమారుడు ఉన్నాడు. కుటుంబ పరిస్థితుల కారణంగా, వారు విడివిడిగా నివసిస్తున్నారు. తన బిడ్డకు ఆకలి వేసినప్పుడు, దారిలో అతనికి పాల బాటిల్ అందిస్తూ.. మరో చేత్తో టిక్కెట్లు ఇస్తానని నిధి తెలిపారు. కొన్ని సార్లు మాత్రం.. కండువాతో సీటుకు కట్టేసి.. వేరే వాళ్ల సంరక్షణలో బిడ్డను వదిలేసి.. తన పని చేసుకుంటుంది.
Read Also: Revenge Story: తన భార్యను లేపుకెళ్లిన వ్యక్తిపై కోపంతో..అతడి భార్యను ఎత్తుకెళ్లిన భర్త
నిధి తన బిడ్డను వదిలి పనికి వెళ్లడం కష్టమవుతుంది. కాబట్టి ఆమె తన బిడ్డను బస్సులో పనికి తీసుకువెళుతుంది. తల్లిగా.. కండక్టర్ గా రెండింటికి న్యాయం చేస్తున్న ఆమె అంకిత భావాన్ని ప్రజలు ప్రశంసిస్తున్నారు. అయితే ఓ వ్యక్తి ఆమెను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వీడియో చూసిన నెటిజన్లు ఆమెను విపరీతంగా పొగుతున్నారు. ధైర్యం ఉంటే ఏ బాధ్యతా భారంగా అనిపించదని అంటూ.. కామెంట్లు పెడుతున్నారు.
