రోజు తాగొచ్చి వేధిస్తున్న మరిదిని పిచ్చి కొట్టుడు కొట్టింది వదిన. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ దేవరియా జిల్లాకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కారణం మరిదిన వదిన పిచ్చి కొట్టుడు కొట్టింది. అది కూడా చిన్న కొడుకు హెల్ప్ తీసుకుని పొట్టు పొట్టు కొట్టింది. విషయం ఏంటంటే.. రేఖా అనే వివాహితను తన మరిది వేధించేవాడు. తాగొచ్చి గొడవపడేవాడు. తరుచుగా ఇదే సీన్ రీపీట్ అవుతుండడంతో … సహనం నశించిన ఆమె.. మరిదిపై దాడి చేసింది.
ఆదివారం కూడా ఇలాగే మందుకొట్టిన మిథున్ తడబడుతూనే.. రేఖను తిట్టడం మొదలుపెట్టాడు. ముందుగా శాంతంగా హెచ్చరించింది. కానీ వినకపోవడంతో కర్ర అందుకుని బాదింది. మిథున్‌ను నేలపై పడేయడంతో ఆమె చిన్నకొడుకు కదలకుండా పట్టుకోగా.. ఆమె కొట్టింది. 20 సెకన్ల ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. చుట్టూ జనాలు ఉన్నా ఎవరు జోక్యం చేసుకోలేదు. కారణం తాగేందుకు ఇప్పటికే చాలా వరకు ఆస్తులు ఆమ్మాడని తెలుస్తోంది. ఇక కేసు నమోదు చేసిన పోలీసులు మైనర్ బాలుడిని విచారించినట్లు తెలుస్తోంది.
