Site icon NTV Telugu

Jhansi: రైల్వే గేట్ వేశారని.. బైక్ ని భుజాలపై మోసుకెళ్లిన బహుబలి..

Untitled Design (1)

Untitled Design (1)

ఉత్తరప్రదేశ్‌లో ఓ వ్యక్తి రైల్వే క్రాసింగ్ వద్ద గేట్ వేయడంతో.. తన బైక్ ను భుజంపై పెట్టుకుని వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఝాన్సీ నుండి ఒక షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మూసివేసిన రైల్వే క్రాసింగ్‌ను దాటడానికి ఒక వ్యక్తి తన బైక్‌ను భుజంపై మోసుకెళ్లాడు. ఈ వీడియో ఝాన్సీ-కాన్పూర్ రైల్వే లైన్ సమీపంలోని మోంతా పోలీస్ స్టేషన్ ప్రాంతం నుండి వచ్చినట్లు సమాచారం. ఎవరో ఈ వీడియోను రికార్డ్ చేసి వైరల్ చేశారు. వీడియో వైరల్ అయిన తర్వాత, పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు.

బైక్‌ను భుజంపై మోసుకెళ్తున్న వ్యక్తి ప్రదీప్ అని పోలీసులు వెల్లడించారు. ఇలా ప్రమాదకరంగా రైల్వే గేట్ దాటడం నేరమని.. బైక్ కింద పడి ప్రమాదం జరిగితే నష్టం జరిగి ఉండేదని తెలిపారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) తదుపరి చర్యలు తీసుకుంటుందని పోలీసులు చెప్పుకొచ్చారు.

Exit mobile version