Site icon NTV Telugu

Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ లో విషాదం.. అగ్నిప్రమాదంలో ఐదుగురి మృతి

Fire Accident

Fire Accident

Fire accident in Uttar pradesh: ఉత్తర్ ప్రదేశ్ లో విషాదం చోటు చేసుకుంది. పెళ్లి వేదికలో మంటలు చెలరేగడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ మోరాదాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ముందుగా ఓ పెళ్లి వేదికలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ తరువాత అవి మూడొంతస్తుల భవనానికి వ్యాపించాయి. దీంతో భవనంలో ఉన్న ఐదుగురు మరణించారు. గురువారం జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలతో పాటు ముగ్గురు పిల్లలు చనిపోయారు. చనిపోయిన వారంత ఒకే కుటుంబానికి చెందినవారే.

Read Also: Gandhi Hospital Doctors: మత్తుమందు ఇవ్వకుండా ‘అడవిదొంగ’ సినిమా చూపించి సర్జరీ చేసిన వైద్యులు

సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశాయి. ఈ ప్రమాదంలో మరో ఏడుగురు గాయాలతో బయటపడ్డారు. మొరాదాబాద్ లోని అమరుద్దీన్ అనే వ్యకి మూడో అంతస్తులో నివాసం ఉంటున్నాడు. అయితే గురువారం రాత్రి సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే ఇంట్లో వారంతా సహాయం కోసం ఆర్తనాదాలు చేశారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుంది. ప్రాణాలతో ఉన్న ఏడుగురిని కాపాడారు. అయితే ఈ ప్రమాదంలో అమరుద్దీన్ అత్త సమర్, కోడలు షామా, కుతురు నఫియా, కొడుకు ఇజాబ్ తో పాటు మరో వ్యక్తి మరణించారు. ఈ ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం అని అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు విచారణ ప్రారంభించారు.

Exit mobile version