Site icon NTV Telugu

US: భారత్ కారణంగానే రష్యా రెచ్చిపోతుంది.. మార్కో రూబియో విమర్శలు

Marcorubio

Marcorubio

భారత్‌పై అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి భారతదేశం చమురు కొనుగోలు చేయడం ఏ మాత్రం బాగోలేదని.. ఈ పరిణామం కచ్చితంగా చికాకు కలిగించే అంశం అని రూబియో పేర్కొన్నారు. రష్యా దగ్గర భారత్‌ చమురు కొనడంతోనే పుతిన్‌ రెచ్చిపోయి.. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని కొనసాగిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇదే భారత్‌తో చర్చల్లో తమను ఇబ్బందిపెట్టే అంశమని వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: Home Minister Vangalapudi Anitha: వైఎస్‌ జగన్ అరెస్ట్ పై హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు..

రష్యాతో సంబంధాలు పెట్టుకున్నందుకు ట్రంప్ భారతదేశంపై 25 శాతం సుంకాన్ని విధించారు. అంతేకాకుండా రష్యా దగ్గర సైనిక పరికరాలు, ఇతర కొనుగులు చేస్తే అదనపు జరిమానా కూడా విధిస్తామంటూ ట్రంప్ హెచ్చరించారు. ఉక్రెయిన్‌లో దాడులు ఆపాలని ప్రపంచమంతా గొంతెత్తి అరుస్తుంటే.. రష్యాతో భారత్ సంబంధాలు పెట్టుకోవడం ఏ మాత్రం బాగోలేదన్నారు. తాజాగా రూబియో కూడా భారత్‌పై రుసరుసలాడారు. రష్యా దగ్గర చమురు కొనుగోలు చేయడంతోనే ఉక్రెయిన్‌పై పుతిన్ యుద్ధం కొనసాగిస్తున్నారని.. దీనికి భారతదేశమే కారణం అన్నారు.

ఇది కూడా చదవండి: Paritala Sunitha: సూట్‌ కేసు రెడీ చేసుకో…. త్వరలో జైలుకే..!

మార్కో రుబియో గురువారం ఫాక్స్‌ రేడియోతో మాట్లాడుతూ.. అన్ని దేశాల్లాగే ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసుకునేందుకు చమురు, బొగ్గు, గ్యాస్‌ కొనగలిగే శక్తి భారత్‌కు ఉందని.. అయితే భారత్‌.. అవసరాల దృష్ట్యా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందన్నారు. రష్యాపై పలు దేశాల ఆంక్షల వల్ల అక్కడ భారత్‌కు చమురు చౌకగా లభిస్తోందని… దురదృష్టవశాత్తు భారత్‌ చమురు కొనుగోలు చేస్తున్న కారణంగానే రష్యాలను నిధులు సమకూరుతున్నాయని ఆరోపించారు. వాటిని రష్యా.. ఉక్రెయిన్‌తో యుద్ధం చేయడంలో వాడుకుంటోందని తెలిపారు. ఇదే అమెరికాను ఇబ్బంది పెట్టే అంశంగా పేర్కొన్నారు.

 

Exit mobile version