Site icon NTV Telugu

USA: “భారతీయుల వల్లే ఉద్యోగాలు కోల్పోతున్నాం”.. యూఎస్ ఇన్‌ఫ్లూయెన్సర్ల బలుపు మాటలు..

Usa

Usa

USA: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై 50 శాతం టారిఫ్స్ విధించడంతో, రెండు దేశాల సంబంధాల్లో ఉద్రిక్తతలు తలెత్తాయి. మరోవైపు, భారత్, రష్యాకు మరింత దగ్గర అవ్వడంతో పాటు చైనాతో సంబంధాలు మెరుగుపడటం, అమెరికన్ రాజకీయవేత్తల్ని కలవరపరుస్తోంది. ఇదిలా ఉంటే, ట్రంప్ మద్దతుదారులైన, రైట్-వింగ్ ఇన్‌ఫ్లూయెన్సర్లు బలుపు మాటలు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా భారతీయ వర్కర్లు, విద్యార్థులను టార్గెట్ చేశారు. అంతటితో ఆగకుండా ‘‘కాల్ సెంటర్’’ ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

‘‘భారత్‌లో అమెరికా ఎలాంటి ట్రేడ్ డీల్ చేసినా, వారికి మరిన్ని వీసాలు ఇవ్వాల్సి ఉంటుంది. మాకు ట్రేడ్ డెఫిషిట్, వీసాల రూపంలో వారికి చెల్లించాల్సిన అవసరం లేదు. మోడీ చైనాతో ఎలాంటి ఒప్పందం చేసుకోగలడో చూద్దాం’’అని ప్రముఖ కామెంటేటర్ లారా ఇంగ్రహమ్ తన ఎక్స్ పోస్టులో కామెంట్ చేశారు.

ట్రంప్ మద్దతుదారు చార్లీ కిర్క్ కూడా ఇదే విధంగా విద్వేష వ్యాఖ్యలు చేశారు. ‘‘భారతీయుల వల్లే అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోతున్నారు. అమెరికాకు ఇక ఉద్యోగుల అవసరం లేదు. మన దేశ ప్రజలకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి’’ అని అన్నారు.

Read Also: China Tomb Raiding Case: డ్యామిట్ కథ అడ్డం తిరిగింది.. సమాధులను తవ్వి కటకటాల పాలయ్యాడు..

ప్రముఖ రైట్ వింగ్ కామెంటేటర్ జాక్ పోసోబియెక్ మరింత విషం వెళ్లగక్కాడు. ‘‘కాల్స్ సెంటర్స్‌పై 100 శాతం టారిఫ్స్ వేయాలి. విదేవీ రిమోట్ ఉద్యోగాలపై అదే విధంగా సుంకాలు వేయాలి’’ అని అన్నారు.

అయితే, వీరి వ్యాఖ్యలు, విద్వేషంపై భారతీయ అమెరికన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పుడూ లేని విధంగా ఈ సారి భారతీయ అమెరికన్లు ట్రంప్, రిపబ్లికన్లకు మద్దతు ఇచ్చారు. ఇవన్నీ చూస్తుంటే తాము మద్దతు ఇచ్చి తప్పు చేశామనే భావనను వ్యక్తం చేశారు. పత్రికా రచయిత బిల్లీ బినియన్ మాట్లాడుతూ.. ‘‘ఇది అసూయ. భారతీయులు బాగా చదువుకుని, కష్టపడి ముందుకెళ్తే, కొంతమంది ఎదుగుదలగా కాకుండా పోటీగా చూస్తు్న్నారు’’ అని అన్నారు. అమెరికాలో టెక్ ఉద్యోగాల్లో భారతీయులకు ప్రాధాన్యం దక్కుతోంది. హెచ్-1బీ వీసాదారుల్లో భారతీయులు 75శాతం మంది ఉన్నారు. అమెరికాలో 2 లక్షలకు పైగా భారతీయ విద్యార్థులు ఉన్నారు.

Exit mobile version