NTV Telugu Site icon

UPSC: సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు విడుదల

Upsc

Upsc

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) 2024 పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. దేశవ్యాప్తంగా జూన్‌ 16న పరీక్ష నిర్వహించారు. మెయిన్స్‌ పరీక్షకు క్వాలిఫై అయిన అభ్యర్థుల రోల్‌ నంబర్లతో జాబితాను విడుదల చేసింది. అభ్యర్థులు సాధించిన మార్కులు, కటాప్‌ మార్కులు, ఆన్షర్‌ కీ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయనున్నట్లు తెలిపింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక UPSC వెబ్‌సైట్ upsc.gov.inలో చూడవచ్చు.

ఇది కూడా చదవండి: Heavy rain alert: 7 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. లిస్టు విడుదల

అలాగే ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను కూడా యూపీఎస్సీ ప్రకటించింది. ఐఎఫ్‌ఎస్‌ (మెయిన్‌) పరీక్షకు అర్హత సాధించిన వారి జాబితాను విడుదల చేసింది.

ఇది కూడా చదవండి: AP: రాష్ట్ర చరిత్రలో రికార్డు స్థాయిలో పెన్షన్ల పంపిణీ..ఒక్క రోజులో దాదాపు 95శాతం

మొత్తం 13.4 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. జనరల్ స్టడీస్ (పేపర్ I) భారతీయ రాజకీయాలు, భౌగోళికం, చరిత్ర, భారత ఆర్థిక వ్యవస్థ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం మరియు జీవావరణ శాస్త్రం మరియు అంతర్జాతీయ సంబంధాలు వంటి అంశాలు కవర్ అయ్యాయి. సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (పేపర్ 2)లో రీజనింగ్ మరియు ఎనలిటికల్ ప్రశ్నలు, రీడింగ్ కాంప్రహెన్షన్ ప్రశ్నలు వచ్చాయి. మొత్తం 400 మార్కులు ఉన్నాయి. విజయవంతమైన అభ్యర్థులు తదుపరి దశ, UPSC సివిల్ సర్వీసెస్ (మెయిన్స్) పరీక్ష 2024, తర్వాత ఇంటర్వ్యూ లేదా పర్సనాలిటీ టెస్ట్‌లో పాల్గొనడానికి అర్హులు.

ఇది కూడా చదవండి: RBI: ఇప్పటికీ రూ.7000 కోట్ల విలువైన రూ.2000 నోట్లు ప్రజల వద్దే ఉన్నాయ్..