NTV Telugu Site icon

UPSC: ఢిల్లీ ఎన్నికల కారణంగా యూపీఎస్సీ పర్సనాలిటీ టెస్ట్ తేదీ మార్పు.. ఎప్పుడంటే..!

Upsc

Upsc

యూపీఎస్సీ అభ్యర్థులకు కీలక అలర్ట్ జారీ చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల కారణంగా యూపీఎస్సీ సీఎస్‌ఈ 2024 ఇంటర్వ్యూను రీషెడ్యూల్ చేసింది. ఫిబ్రవరి 5న జరగాల్సిన పర్సనాలిటీ టెస్ట్ ఫిబ్రవరి 8కు మార్చబడినట్లు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది.

సివిల్ సర్వీసెస్ (మెయిన్) ఎగ్జామినేషన్ పర్సనాలిటీ టెస్ట్ జనవరి 7న ప్రారంభమైంది. ఏప్రిల్ 17, 2025న ముగుస్తుంది. ఇంటర్వ్యూలో మొత్తం 2,845 మంది అభ్యర్థులు పాల్గొంటారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 5న కూడా టెస్ట్ ఉంది. అయితే అదే రోజున కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తేదీని ప్రకటించింది. ఐదేళ్లకోసారి ఎన్నికలు వస్తాయి. కాబట్టి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని యూపీఎస్సీ ఇంటర్య్వూ తేదీని మార్పు చేసింది. ఫిబ్రవరి 5 నుంచి 8కు మార్చింది. ఈ మేరకు వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని పేర్కొంది. పర్సనాలిటీ టెస్ట్ రెండు సెషన్లలో జరుగుతుంది. ఉదయం సెషన్ ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం సెషన్ మధ్యాహ్నం 1 గంటలకు ప్రారంభమవుతుంది. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు ప్రయాణ ఖర్చుల రీయింబర్స్‌మెంట్‌కు అర్హులు. సెకండ్/స్లీపర్ క్లాస్ రైలు ఛార్జీలకు (మెయిల్ ఎక్స్‌ప్రెస్) మాత్రమే పరిమితం.

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 5న జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు మాత్రం ఫిబ్రవరి 8న (శనివారం) విడుదల కానున్నాయి. దేశ రాజధానిలో జరిగే ఎన్నికలు కాబట్టి ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇక్కడు కాంగ్రెస్, ఆప్, బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. మరోసారి అధికారం కోసం ఆప్ ప్రయత్నం చేస్తోంది.

Show comments