Wedding Season: భారతదేశంలో పెళ్లిళ్ల సీజర్ మళ్లీ మొదలైంది. నవంబర్ 12 నుంచి డిసెంబర్ 16 వరకు దాదాపుగా దేశంలో 48 లక్షల వివాహాలు జరగబోతున్నాయి. ఈ పెళ్లిళ్ల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో దాదాపుగా రూ. 6 లక్షల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉంది. ఇది గతేడాది జరిగిన వ్యాపారంతో పోలిస్తే 41 శాతం పెరుగుదలని చూపిస్తోంది. గతేడాది ఇదే కాలంలో రూ. 4.25 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) నిర్వహించిన అధ్యయనం తెలియజేసింది. గతేడాది ఇదే కాలంలో 35 లక్షల వివాహాలు జరిగాయి. గతేడాదిలో ఈ కాలంలో వివాహాలకు సంబంధించి మొత్తం 11 మంచి రోజులు ఉంటే, ఈ ఏడాది ఇది 18గా ఉంది.
Read Also: Karnataka: బెలగావిలో ‘‘ఔరంగజేబు’’ పోస్టర్ కలకలం..
CAIT అంచనా ప్రకారం.. రూ. 3 లక్షల ఖర్చుతో 10 లక్షల పెళ్లిళ్లు, రూ. 6 లక్షల ఖర్చుతో 10 లక్షల పెళ్లిళ్లు, రూ. 10 లక్షల ఖర్చుతో 10 లక్షల పెళ్లిళ్లు, రూ. 15 లక్షల ఖర్చుతో 15 లక్షల పెళ్లిళ్లు, రూ. 25 లక్షల ఖర్చుతో 7 లక్షల పెళ్లిళ్లు, రూ. 50 లక్షల ఖర్చుతో 50 వేల పెళ్లిళ్లు, రూ. 1 కోటి ఖర్చుతో 50 వేల పెళ్లిళ్లు జరుగుతాయని చెబుతోంది. ఈ సీజన్‌లో నవంబర్ 12, 13, 17, 18, 22, 23, 25, 26, 28, మరియు 29 మరియు డిసెంబర్ 4, 5, 9, 10, 11, 14, 15, 16 తేదీల్లో శుభప్రదమైన వివాహ తేదీలు ఉన్నాయి. వీటి తర్వాత ఒక నెల విరామం అనంతరం జనవరి నుంచి మార్చి 2025 మధ్యలో మళ్లీ వివాహాల సీజన్ ప్రారంభమవుతుంది.
వివాహ ఖర్చుల విషయాని వస్తే.. ఆభరణాలు (15 శాతం), దుస్తులు (10 శాతం), ఎలక్ట్రానిక్స్ మరియు ఉపకరణాలు (5 శాతం), డ్రై ఫ్రూట్స్, స్వీట్లు, స్నాక్స్ (5 శాతం) వంటి వస్తువులలో ప్రధాన ఖర్చులు ఉంటాయి. కిరాణా సామాన్-కూరగాలలకు (5 శాతం), గిఫ్ట్స్ (4 శాతం), ఇతర వస్తువులు(6 శాతం) పెళ్లి ఖర్చులు ఉండనున్నాయి. బాంక్వెట్ హాళ్లు-హోటళ్లు-వేదికలు (5 శాతం), క్యాటరింగ్ సేవలు (10 శాతం), ఈవెంట్ మేనేజ్‌మెంట్- పూల అలంకరణలు- రవాణా – క్యాబ్ సేవలు (3 శాతం), ఫోటోగ్రఫీకి – వీడియోగ్రఫీ ఖర్చులు (2 శాతం) ఖర్చులు ఉండే అవకాశం ఉంది.