Site icon NTV Telugu

UP temple: ఆలయంలో విద్యుత్‌షాక్‌, తొక్కిసలాట.. ఇద్దరు మృతి, 40 మందికి పైగా గాయాలు..

Up Temple

Up Temple

UP temple: సోమవారం తెల్లవారుజామున ఉత్తర్ ప్రదేశ్‌లోని హైదర్‌గఢ్ అవసనేశ్వర్ మహాదేశ్ ఆలయంలో తొక్కసిలాట జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించిగా, 40 మందికిపైగా గాయపడ్డారు. విద్యుత్ తీగ టిన్ షెడ్‌పై పడి అనేక మందికి విద్యుత్ షాక్ వచ్చినట్లు తెలుస్తోంది. శ్రావణ మాసం సోమవారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి వచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Read Also: Ind vs Eng: ఐదో టెస్టుకు పంత్‌ దూరం.. జట్టులోకి తమిళనాడు ప్లేయర్

మృతుల్లో ఒకరిని లోనికాత్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని ముబారక్‌పురా గ్రామానికి చెందిన 22 ఏళ్ల ప్రశాంత్‌గా గుర్తించారు. మరొకరిని ఇంకా గుర్తించలేదు. త్రివేదిగంజ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో చికిత్స పొందుతూ ఇద్దరూ మరణించారు. జలాభిషేక సమయంలో హైదర్‌గఢ్ లోని ఆలయంలో పెద్ద సంఖ్యలో భక్తులు గుమిగూడిన సమయంలో తెల్లవారుజామున 3 గంటలకు ఈ విషాద సంఘటన జరిగింది.

కోతుల వల్ల దెబ్బతిన్న పాత విద్యుత్ తీగ వల్ల విద్యుత్ షాక్ సంభవించినట్లు జిల్లా కలెక్టర్ శశాంక్ త్రిపాఠి తెలియజేశారు. కొతులు ఓవర్ హెడ్ విద్యుత్ లైన్‌పైకి దూకడంతో వైర్ తెగి, రేకుల షెడ్డుపై పడింది. దీంతో దాదాపుగా 19 మంది విద్యుత్ షాక్‌కి గురయ్యారు. దీంతో ఒక్కసారిగా భక్తుల్లో గందరగోళం, భయాందోళన ఏర్పడింది. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది.

Exit mobile version