NTV Telugu Site icon

UP: ఫస్ట్ నైట్‌లో బీరు, గంజాయి కోరిన కొత్త పెళ్లికూతురు.. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు..

Up, Saharanpur

Up, Saharanpur

UP: ఉత్తర్ ప్రదేశ్‌లో కొత్తగా పెళ్లయిన వ్యక్తికి ‘‘ఫస్ట్ నైట్’’లో షాక్ తగిలింది. కొత్త పెళ్లికూతురు తొలి రాత్రి బీరు, గంజాయి, మేక మాంసం కోరడంతో ఈ విషయం పోలీస్ స్టేషన్‌కి చేరింది. తొలి రాత్రి ‘‘ ముహ్ దిఖాయ్’’ ఆచారంలో వధువు బీరు కావాలని కోరింది. దీంతో భర్త ఒకింత ఆశ్చర్యపోయినప్పటికీ, ఆమె బీరు ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు. ఆ తర్వాత గంజాయి, మేక మాంసం అడగడంతో షాక్ అయ్యాడు.

Read Also: Honeymoon: హనీమూన్‌పై వివాదం.. అల్లుడిపై మామ యాసిడ్ దాడి..

వధువు మత్తు పదార్థాలు అడగడంతో తట్టుకోలేని వరుడి కుటుంబ సభ్యులు ఈ విషయంపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇరువర్గాల వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. వధువు థర్డ్ జెండర్ అని, ఆడది కాదని భర్త కుటుంబీకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అయితే, ఈ విషయంపై ఫిర్యాదు చేయలేదు. దీనిని కుటుంబ పంచాయతీలో పరిష్కరించుకోవాలని భావించారు.