అసలు ఈ మధ్య సమాజం ఎటు పోతుందో అర్ధం కాని పరిస్థితి ఏర్పడింది. మానవ సంబంధాలన్ని మంటగలసిపోతున్నాయి. వావి వరస లేకుండా ఆడ, మగ ఇద్దరూ ప్రవర్తిస్తున్నారు. కొందరు చెల్లి వరుస అయ్యే వాళ్లతో.. మరొకరు అక్క అయ్యే వాళ్లతో ఎఫైర్ లు పెట్టుకుంటున్నారు. ఇలాంటివి చూసినప్పుడు సమాజం సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వస్తోంది. ఇలాంటి ఘటనే యూపీలో చోటుచేసుకుంది…
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ రాంపూర్‌లో కుటుంబ విలువలకు మచ్చ తెచ్చే సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడు వరుసకు పిన్ని అయిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. తన బాబాయి భార్యకు అట్రాక్ట్ అయిన వ్యక్తి.. శారీరక సంబంధం వరకు వెళ్లాడు. కానీ ఆ తర్వాత దూరం పెట్టేందుకు ప్రయత్నించాడు. దీంతో పిన్ని అతనిపై అత్యాచార ఆరోపణలు చేస్తూ కేసు పెట్టింది. దీంతో ఇద్దరిని పోలీస్ స్టేషన్‌కు పిలవగా.. కథలో కీలక మలుపు చోటు చేసుకుంది. కలిసి జీవిస్తామని పోలీసుల సమక్షంలో గాంధర్వ వివాహం చేసుకున్నారు. దండలు మార్చుకున్నారు.
కానీ ఆ మహిళ భర్త మాత్రం తనను సొంత అన్న కొడుకు, తన భార్య మోసం చేశారని వాపోయాడు. తాను ఒంటరి వాడిని అయిపోయానని బాధపడ్డాడు. వాళ్లు ఎటుపోయినా ఇక తాను పట్టించుకోనని.. జీవితంలో ఇంతకు మించిన బాధ మరొకటి ఉండదంటూ కన్నీరు పెట్టుకున్నాడు. మరోవైపు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కాగా గాంధర్వ వివాహం చట్టప్రకారం చెల్లుతుందా అనే ప్రశ్నలు వస్తున్నాయి.