ఎన్ని కఠిన చట్టాలొచ్చినా నేరాలు మాత్రం తగ్గడం లేదు. ఎక్కడొక చోట నేరాలు-ఘోరాలు జరుగుతూనే ఉంటున్నాయి. రోజురోజుకూ నేర తీవ్రత పెరిగిపోతుంది తప్ప తగ్గడం లేదు. స్నేహితుడి చెల్లిని ప్రేమించిన పాపానికి ప్రియుడిని అత్యంత క్రూరంగా చంపేసి అవయవాలు నదిలో విసిరేశారు. ఈ ఘోరం ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
రిషికేశ్ (22) కాన్పూర్‌లోని చకేరి ప్రాంత వాసి. పవన్ మల్లా అనే స్నేహితుడి చెల్లిని రిషికేశ్ ప్రేమించాడు. అయితే ఈ వ్యవహారం పవన్ మల్లాకు రుచించలేదు. రిషికేశ్‌ను చంపాలని కుట్రపన్నాడు. అందుకోసం మరికొంత మంది స్నేహితుల మద్దతు కోరాడు.
ఆగస్టు 29న సాయంత్రం రిషికేశ్‌ను స్నేహితులు మోగ్లి, నిఖిల్ ఇంట్లో నుంచి పిలిచారు. గణేష్ చతుర్థి పండల్‌ను దర్శించేందుకు వెళ్తున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పి బయటకు తీసుకెళ్లారు. రెండ్రోజులైనా రిషికేశ్ ఇంటికి రాకపోవడంతో అతని అన్నయ్య రవికుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగంలోకి దిగి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. రిషికేశ్‌ను చంపేసి.. తలను వేరు చేసి.. మిగతా అవయవాలను ముక్కలు.. ముక్కలు చేసి నది ఒడ్డున విసిరేసినట్లు చెప్పుకొచ్చారు. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు మహారాజ్‌పూర్ ప్రాంతంలో నది ఒడ్డున తల, కొన్ని అవయవాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇది కూడా చదవండి: YS Rajasekhara Reddy Vardhanthi: వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి.. వైఎస్సార్ ఘాట్‌లో నివాళులర్పించిన జగన్..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నలుగురు స్నేహితులు వచ్చి రిషికేశ్‌ను ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్లారన్నారు. గణేష్ మండపం దగ్గరకు వెళ్లాక.. పవన్, బాబీ, డానీ, సత్యం, రిషు, ఆకాష్ అనే అనేక మంది ఇతర పరిచయస్తులు అప్పటికే మండపం దగ్గర వేచి ఉన్నారని చెప్పారు. అనంతరం అందరూ కలిసి రిషికేశ్‌ను బలవంతంగా మోటార్ సైకిల్‌పై ఎక్కించుకుని.. కాన్పూర్ శివారులోని కాకోరి అడవి వైపు తీసుకెళ్లి చంపేశారన్నారు. రిషికేశ్‌ను తాడుతో కట్టేసి.. కాళ్ళు కట్టిన తర్వాత కత్తితో గొంతు కోసి చంపారన్నారు. అనంతరం తలను వేరు చేసి.. అవయవాలన్నీ ముక్కలు.. ముక్కలు చేసి నది ఒడ్డున విసిరేశారని పోలీసులు వెల్లడించారు. మృతదేహాన్ని గుర్తించకుండా ఉండటానికి నిందితుడు తల నరికినట్లుగా నిందితులు చెప్పినట్లుగా తెలిపారు. అవయవాలను రిక్షాలో తీసుకెళ్లి గంగా నదిలో వేర్వేరు ప్రాంతాల్లో విసిరేశారని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Mitchell Starc: మిచెల్ స్టార్క్ షాకింగ్ నిర్ణయం!
ప్రధాన నిందితుడు పవన్ మల్లాగా గుర్తించారు. పవన్ చెల్లితో రిషికేశ్ సంబంధం పెట్టుకున్నందుకే చంపేశాడని పోలీసులు తెలిపారు. పవన్‌కు నేర చరిత్ర ఉందని.. కాన్పూర్ జిల్లా నుంచి 6 నెలల పాటు బహిష్కరణకు గురైనట్లుగా వెల్లడించారు. తిరిగి వచ్చాక.. లవ్ ఎఫైర్ తెలిసి పవన్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని చెప్పారు. బాధితుడి కుడి చేతిపై ఉన్న పచ్చబొట్టు.. మణికట్టు చుట్టూ కట్టిన పవిత్ర దారం ఆధారంగా మృతదేహం రిషికేశ్‌దేనని బంధువులు గుర్తించారని పోలీసులు తెలిపారు. ప్రధాన నిందితుడి సహా మరో నలుగురు పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు.
