Site icon NTV Telugu

Heart Attack: విషాదం.. పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో మృతి

Up Man Dies Of Heart Attack

Up Man Dies Of Heart Attack

UP man dies of heart attack while dancing at wedding event: ఇటీవల యువతతో పాటు అన్ని ఏజ్ గ్రూపుల్లో గుండెపోటు సర్వసాధారణంగా మారింది. ఉన్నట్టుండీ హఠాత్తుగా గుండెపోటుతో మరణించిన కేసులను ఇటీవల చూస్తున్నాం. మారుతున్న జీవవశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడంతో చాలా మంది గుండెపోటు బారిన పడుతున్నారు. చివరకు మూడు పదుల వయస్సులోపు ఉన్న వారు కూడా హార్ట్ ఎటాక్స్ కు గురవుతున్నారు.

Read Also: Crime News: నలుగురు వృద్ధులతో ఒకేసారి మహిళ శృంగారం.. ఐదోవాడు రావడంతో దారుణం

ఇదిలా ఉంటే యూపీలో ఓ విషాద ఘటన జరిగింది. పెళ్లిలో జాలీగా డ్యాన్సు చేస్తున్న వ్యక్తి ఉన్నట్టుండి గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఉత్తర్ ప్రదేశ్ వారణాసిలో నవంబర్ 25న ఓ వివాహ కార్యక్రమంలో డ్యాన్స్ చేస్తూ 40 ఏళ్ల వ్యక్తి మరణించాడు. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. మనోజ్ విశ్వకర్మ అనే వ్యక్తి పిల్పాని కత్రా సమీపంలో ఓ వివాహ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి డ్యాన్స్ చేస్తున్న క్రమంలో గుండె పోటుకు గురయ్యాడు. కుటుంబీకులు స్పందించేలోపే అక్కడికక్కడే మరణించాడు. గత నెలలో ఇదే తరహాలో దాహెద్ జిల్లాలో ఓ కార్యక్రమంలో డ్యాన్స్ చేస్తూ 51 ఏళ్ల వ్యక్తి మరణించారు.

ప్రముఖ కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్, బాలీవుడ్ సింగర్ కేకే, బాలీవుడ్ యాక్టర్ సిద్ధార్థ్ శుక్లా వంటి ప్రముఖులు గుండెపోటుతో మరణించారు. చిన్న వయస్సులోనే ఇలా పలువురు మరణించడం వారి అభిమానులను బాధకు గురిచేసింది. గతేడాది జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తూ.. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించారు. అతి చిన్న వయసులోనే చనిపోవడం పునీత్ అభిమానులను దు:ఖసాగరంలో ముంచేసింది.

Exit mobile version