NTV Telugu Site icon

Tragedy love story: ప్రియురాలి కుటుంబం వేధింపులు.. యువకుడి ఆత్మహత్య..

Uttar Pradesh

Uttar Pradesh

Tragedy love story: ఉత్తర్ ప్రదేశ్‌కి చెందిన ఓ యువకుడి ప్రేమకథ విషాదంగా మారింది. ప్రేయసి కుటుంబం వేధింపులకు గురిచేస్తుందని ఆరోపిస్తూ, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఫేస్‌బుక్ పోస్టులో “హమారీ అధూరి కహానీ” (మా అసంపూర్ణ కథ) అని పోస్ట్ చేసి సూసైడ్ చేసుకున్నాడు. సుధీర్ కుమార్ అనే యువకుడు, కోమల్ అనే యువతి 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఆరు నెలల క్రితం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు.

Read Also: Jitendra Yunik EV Scooter: ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు.. రయ్.. రయ్.. మంటూ 118 కి.మీ.ల మైలేజ్

అయితే, కోమల్ కుటుంబం ఈ పెళ్లిని ఒప్పుకోలేదని, తననున వేధిస్తున్నారని సుధీర్ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. కోమల్ సోదరుడు ఆయుష్ తన రూమ్మేట్ అని, ముందుగా తమ ప్రేమకు అతను మద్దతుగా నిలిచాడని, కానీ కోమల్ తల్లిదండ్రులు వేధించినట్లు ఆరోపించాడు. కోమల్ పదే పదే తనతో ఉండాలని కోరుకోవడం వల్లే తాము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నట్లు లేఖలో పేర్కొన్నాడు. కోమల్ తన వివాహం గురించి కుటుంబ సభ్యులకు చెప్పిందని, ఆ తర్వాత నుంచి తాము మాట్లాడుకోవడం మానేశామని చెప్పారు. కోమల్, ఆమె కుటుంబం వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించాడు.

కోమల్, ఆమె తల్లి, సోదరుడు ఆయుష్ తనను చనిపోవాలని కోరారని సుధీర్ నోట్‌లో ఆరోపించాడు. బుధవారం ఉదయం సుధీర్ ఇంటికి సమీపంలో చెట్టుకు ఉరేసుకుని మరణించాడు. కోమల్ తల్లిదండ్రులు విడాకుల కోసం ఒత్తిడి తెస్తున్నారని సుధీర్ కుటుంబీకులు తెలిపారు. కోమల్ చెబితే తప్పా తాను విడాకులు ఇవ్వనని చెప్పాడని సుధీర్ సోదరుడు చెప్పాడు. మృతదేహాన్ని శవపరీక్ష కోసం పంపినట్లు పోలీసు అధికారి సంతోష్ కుమార్ తెలిపారు. సుధీర్ కుటుంబం ఫిర్యాదు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Show comments