NTV Telugu Site icon

యూపీలో మళ్ళీ లాక్ డౌన్ పొడిగింపు… 

ఉత్తర ప్రదేశ్ లో మరోసారి లాక్ డౌన్ ను పొడిగించారు.  ఇప్పటికే రెండుసార్లు లాక్ డౌన్ ను పొడిగించిన యూపీ ప్రభుత్వం ఇప్పుడు మరోసారి లాక్ డౌన్ ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.  కరోనా కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.  మే 17 వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగించారు.  మొదటి వేవ్ సమయంలో లాక్ డౌన్ ను అమలు చేసి కరోనాను సమర్ధవంతంగా కంట్రోల్ చేసింది యూపీ ప్రభుత్వం.  సెకండ్ వేవ్ ఉధృతి అధికంగా ఉండటంతో రోజూ వేల సంఖ్యలో కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి.  లాక్ డౌన్ తప్పితే మరొక మార్గం లేకపోవడంతో లాక్ డౌన్ ను అమలు  చేస్తున్నారు.  ప్రస్తుతం 14 రాష్ట్రాల్లో లాక్ డౌన్ అమలు జరుగుతున్నది.