NTV Telugu Site icon

Sambhal: యూపీ సర్కార్ మాస్టర్ ప్లాన్.. తీర్థయాత్రా స్థలంగా సంభాల్‌!

Sambal

Sambal

Sambhal: సంభాల్‌కు సంబంధించి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. సంభాల్‌ను తీర్థయాత్రా స్థలంగా రూపొందించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇక్కడి బావులు, చెరువులను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకుంది. గెజిటీర్ ప్రకారం సంభాల్‌లో గతంలో 19 బావులు ఉండేవి.. పూర్వకాలంలో చెరువు, సరస్సును పుణ్యక్షేత్రాలుగా కొలిచేవారు.. ఇక, సంభాల్‌లో అంత్యక్రియలు నిర్వహించిన వారికి మోక్షం లభిస్తుందని హిందువుల నమ్మకం.

Read Also: Iran Supreme Leader: మేము రంగంలోకి దిగితే అలాంటి సంస్థల అవసరం లేదు..

అలాగే, సంభాల్‌లో ఉన్న స్మశాన వాటికలు ‍ప్రస్తుతం ఆక్రమణలకు గురయ్యాయి. వీటిని తొలగించేందుకు సర్కార్ చర్యలు చేపడుతోంది. ఇక, సంభాల్‌లోని అన్ని దేవాలయాలను అభివృద్ధి చేయడానికి ఉత్తరప్రదేశ్ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఒకప్పుడు సంభాల్‌లో హిందూ ఖేడా అనే హిందువుల కాలనీ ఉండేది.. కానీ, ప్రస్తుతం దానిపై మరో వర్గం ఆధిపత్యం కొనసాగుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీప సరాయ్ కాలనీ పరిస్థితి కూడా ఇదేనని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో యోగీ సర్కార్ న్యాయవాదుల ప్రత్యేక భేటీని నిర్వహించింది. 1978 నాటి అల్లర్లకు సంబంధించిన వివరాలతో కూడిన ఫైళ్లను సేకరించాలని ఉత్తరప్రదేశ్ ‍ప్రభుత్వం సూచించింది.

Show comments