Site icon NTV Telugu

Maha Kumbh Mela: నో వెహికల్ జోన్‌గా ఆదేశాలు.. ప్రయాగ్‌రాజ్‌ను ఖాళీ చేయిస్తున్న పోలీసులు

Up

Up

మహా కుంభమేళాలో భాగంగా ఫిబ్రవరి 12న ప్రయాగ్‌రాజ్‌లో మాఘి పూర్ణిమ స్నానం జరగనుంది. ఇందుకోసం కోట్లాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది. దీంతో యూపీ ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఇప్పటికే మూడు రోజుల నుంచి ప్రయాగ్‌రాజ్‌లో వాహనాలు నిలిచిపోయి ఉన్నాయి. దాదాపు 350 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనాలు ముందుకు.. వెనక్కి పోయే పరిస్థితులు లేవు. దీంతో బుధవారం భక్తులు మరింత పెరిగితే తీవ్ర ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని గ్రహించి యూపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాగ్‌రాజ్ పరిసరాలను నో వెహికల్ జోన్‌గా ప్రకటించింది. ఫిబ్రవరి 11, ఉదయం 4 గంటల నుంచి వాహనాలను ఖాళీ చేయిస్తున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి పూర్తిగా వాహనాలు లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు వెహికల్స్ లేకుండా చేయాలనే ఉద్దేశం కఠిన ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం వాహనాలను తరలించే కార్యక్రమానికి పోలీసులు చేపట్టారు. భక్తులు సాఫీగా పోయేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Maha Kumbh Mela: మరో ఘోరం.. బస్సు-ట్రక్కు ఢీ.. ఏడుగురు భక్తులు మృతి

మరో 48 గంటల పాటు ఎవరూ ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లొద్దని మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి ప్రకటించారు. అంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థమవుతుంది. గూగుల్‌లో చూసుకుంటూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్, సివనీ, కట్నీ, మైహర్, సాత్నా, రివా జిల్లాల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌లు అయ్యాయి. 50 కి.మీ. మేర దూరం వెళ్లడానికే 10 నుంచి 12 గంటల సమయం పడుతుందని ప్రయాణికులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: Liquor Prices: అమల్లోకి కొత్త మద్యం ధరలు.. వాటికి మాత్రమే మినహాయింపు..

Exit mobile version