ఎన్నికలు జరుగుతున్న యూపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. యూపీ మాజీ డీజీపీ ప్రకాశ్ సింగ్ ముఖ్యమంత్రి యోగిపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యమంత్రి యోగి నిష్కళంకుడు. ఏ మాత్రం అవినీతి మచ్చలేని సమర్ధుడైన నాయకుడు. రాష్ట్ర హితం, దేశ హితం కోసం మళ్ళీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నా అన్నారు ప్రకాశ్ సింగ్.
పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్ లో అన్సారీ చీకటి సామ్రాజ్యాన్ని యోగి ప్రభుత్వం ధ్వంసం చేసింది. అలా ఎంతోమంది గూండా గిరి చేసిన వాళ్లందరినీ యోగి ప్రభుత్వం కనపడకుండా చేసింది. నా హయాంలో నే, నా నాయకత్వంలో మాఫియా సంస్కృతిని యూపీలో రూపుమాపేందుకు వ్యూహరచన చేశాం. ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. నేను ఆశించిన ఫలితాలు వస్తున్నాయి. అన్నిరకాలుగా అభివృధ్ది, శాంతిభద్రతలు, ప్రజలకు భరోసా కల్పించడంలో యోగి ప్రభుత్వం సఫలీకృతమైందని ప్రశంసలు కురిపించారు.
