NTV Telugu Site icon

UP Elections : ప్రారంభమైన 3వ విడత పొలింగ్‌..

ఉత్తరప్రదేశ్‌లోని 16 జిల్లాల్లో 59 నియోజకవర్గాలకు ఈరోజు మూడో విడత పోలింగ్ జరుగుతోంది. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న పంజాబ్‌లో కూడా నేడు ఓటింగ్‌ జరగనుంది. పంజాబ్‌లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. యూపీలో ఈ రోజు ఉదయం 7 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌లో ఏడు దశల్లో పోలింగ్‌ జరుగుతోంది. 16 జిల్లాల్లోని 59 అసెంబ్లీ స్థానాలకు జరిగే మూడో దశలో 627 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా 2.15 కోట్ల మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.

హత్రాస్, ఫిరోజాబాద్, ఎటాహ్, కస్గంజ్, మైన్‌పురి, ఫరూఖాబాద్, కన్నౌజ్, ఇటావా, ఔరైయా, కాన్పూర్ దేహత్, కాన్పూర్ నగర్, జలౌన్, ఝాన్షీ, లలిత్‌పూర్, హమీర్‌పూర్ మరియు మహోబా జిల్లాల్లో పోలింగ్ జరగనుంది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కర్హాల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయగా, ఈ రోజు కూడా అక్కడ పోలింగ్ జరగనుంది. బీజేపీ ఈ స్థానం నుంచి కేంద్ర మంత్రి ఎస్పీ సింగ్ బఘెల్‌ను బరిలోకి దింపింది. ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లతో పాటు రెండు రాష్ట్రాల ఓట్ల లెక్కింపు మార్చి 10న జరగనుంది.