NTV Telugu Site icon

Groom Sings Song: వేదికపై పాట పాడాడు.. పెళ్లి పెటాకులైంది

Up Bride Calls Of Wedding

Up Bride Calls Of Wedding

UP Bride Calls Off Wedding After Groom Sings SRK Baadshah Song: ‘నేను పెళ్లికొడుకుని కదా, ఏం చేసినా చెల్లుతుంది’ అని అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. మరీ ముఖ్యంగా.. ఎక్కువ యాటిట్యూడ్ చూపిస్తే, అందుకు పరిణామాలు ఎదుర్కోక తప్పదు. ఇదిగో, ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ తాజా ఉదంతమే! ఏం జరిగిందో ఏమో తెలీదు కానీ.. పెళ్లికొడుకు ఒక్కసారిగా పూనకం వచ్చినట్టు స్టేజ్ మీద ఒక పాట పాడాడు. తానేదో రియల్ లైఫ్ అర్జున్ రెడ్డిలాగా యాటిట్యూడ్ ప్రదర్శిస్తూ రెచ్చిపోయాడు. దీంతో.. ఖంగుతిన్న వధువు, పెళ్లిని రద్దు చేసుకుంది. ఇలాంటివాడిని చచ్చినా చేసుకోనంటూ, ఆ మండపం నుంచి వెళ్లిపోయింది. ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే..

Anupama Parameswaran: నల్ల కలువ విరబూసినట్లుందే

ఉత్తరప్రదేశ్‌లోని మావ్ జిల్లాలో ఒక అమ్మాయికి ఒక వ్యక్తితో పెళ్లి నిశ్చయమైంది. ఈ పెళ్లి వేడుకను వధువు తరఫు వారు ఘనంగా నిర్వహించారు. అబ్బాయి తరఫు వాళ్లు మండపానికి చేరుకోవడం, పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. అక్కడంతా సవ్యంగా సాగుతోంది. పెళ్లి ఘడియలు రానే వచ్చేసరికి.. వేదిక మీదకు వధువుని తీసుకొచ్చారు. అప్పుడే అసలు కథ మొదలైంది. పూలదండలు మార్చుకోవడానికి ముందు.. పెళ్లికొడుకు సడెన్‌గా షారుఖ్ ఖాన్ నటించిన ‘బాద్‌షా’ సినిమాలోని ఓ పాట పాడటం మొదలుపెట్టడం. ‘ఆషిక్ హు మై, కాతిల్ భీ హు, సబ్‌కే దిలో మే, షామిల్ భీ హు’ అనే పాటను యాటిట్యూడ్ ప్రదర్శిస్తూ పాడాడు. దీంతో.. వేదికపై ఉన్న వధువు షాక్‌కు గురైంది. ‘‘ఇప్పటివరకు బాగానే ఉన్నాడు.. ఇంతలో ఇతనికి ఏమైంది?’’ అంటూ ఆశ్చర్యానికి గురవుతూ చూసింది.

Viswak Sen: నా మాస్ అమ్మ మొగుడు.. ఎన్టీఆర్.. అసలు సినిమా ముందుంది

ఒకవేళ అతడు రొమాంటిక్‌గా ఆ పాట పాడి ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవేమో కానీ, అందుకు భిన్నంగా అతడు చాలా విచిత్రంగా ప్రవర్తించాడు. దాంతో కోపాద్రిక్తురాలైన వధువు, వెంటనే పెళ్లి రద్దు చేసింది. పెళ్లికొడుకు ఏదైనా విషయంలో కోపంగా ఉన్నాడేమోనని పెళ్లికూతురు తరఫు వారు మాట్లాడ్డానికి ప్రయత్నిస్తే.. ఆ అన్నగారు మాత్రం వినే స్థితిలో లేరు. చివరికి పోలీసులు రంగంలోకి దిగినా.. అతడిలో మాత్రం మార్పు రాలేదు. ఆ దెబ్బకు.. అతడు ‘మానసిక రోగి’ అనుకొని, పెళ్లి కూతురు తరఫు వారు పెళ్లిని రద్దు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Show comments