Site icon NTV Telugu

Fatehpur Sikri Dargah: ఫతేపూర్ సిక్రీ దర్గా కింద కామాఖ్య దేవత ఆలయం ఉంది.. ఆగ్రా కోర్టులో కేసు..

Fatehpur Sikri Dargah

Fatehpur Sikri Dargah

Fatehpur Sikri Dargah: ఉత్తర్ ప్రదేశ్‌లోని ప్రసిద్ధ ఫతేపూర్ సిక్రీ దర్గా కింద కామాఖ్య మాత ఆలయం ఉందని ఓ న్యాయవాది కోర్టులో కేసు ఫైల్ చేశారు. లాయర్ అజయ్ ప్రతాప్ సింగ్ వాదనల్ని విచారించేందుకు ఆగ్రాలోని సివిల్ కోర్టు అంగీకరించింది. ఫతేపూర్ సిక్రీలోని సలీం చిష్టి దర్గాను కామాఖ్య దేవత ఆలయంగా పేర్కొన్నాడు. పక్కనే ఉన్న మసీదు ఆలయ సమూదాయంలో భాగమని చెప్పారు. ప్రస్తుతం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) పరిధఇలో ఉన్న వివాదాస్పద ఆస్తి వాస్తవానికి కామాఖ్య దేవి గర్భగుడి అని అతను చెప్పారు.

ఫతేపూర్ సిక్రీని మొఘల్ రాజు అక్బర్ స్థాపించాడనే విషయాన్ని కూడా అతను సవాల్ చేశాడు. విజయపూర్ సిక్రీ అని కూడా పిలువబడే సిక్రీకి సంబంధించిన ప్రస్తావనలు బాబర్‌నామాలో కనిపిస్తాయని ఆయన పేర్కొన్నారు. దీంతో పాటు న్యాయవాది పురావస్తు ఆధారాలను ప్రస్తావించారు. మాజీ ఆర్కియాలజిస్ట్ సూపరింటెండెంట్ డీజీ శర్మ తవ్వకాలను గురించి ప్రస్తావిస్తూ.. 1000 A.D నాటి కాలానికి చెందిన హిందూ, జైన కళాఖండాలని డీజీ శర్మ చెప్పినట్లు వెల్లడించారు. బ్రిటిష్ అధికారి ఇ.బి. హోవెల్ వివాదాస్పద ప్రాపర్టీలోని స్తంభాలు, పైకప్పు హిందూ శిల్పంగా వర్ణించారని వెల్లడించారు. అంతే కాకుండా ఖన్వా యుద్ధ సమయంలో సిక్రీ రాజు రామ్ ధామ్ దేవ్ కామాఖ్య దేవి విగ్రహాన్ని సురక్షితంగా ఘాజీపూర్‌కి తరలించాడని చెప్పారు.

Read Also: Team India: టీ20 వరల్డ్ కప్కు ఎంపికైన ఆటగాళ్లకు చాలా అనుభవం ఉంది.. విశ్వాసం వ్యక్తం చేసిన జైషా

న్యాయవాది అజయ్ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ.. చట్టప్రకారం,ఒక నిర్మాణాన్ని ఆలయంగా స్థాపించిన తర్వాత దాని స్వభావాన్ని మార్చలేమని చెప్పారు. ఈ కేసును సివిల్ కోర్టులో ప్రవేశపెట్టగా, న్యాయమూర్తి మృత్యుంజయ్ శ్రీవాస్తవ నోటీసులు జారీ చేయాలని ఆదేుశించారు. జామా మసీదు మెట్ల కింద శ్రీకృష్ణుడి విగ్రహాన్ని పాతిపెట్టారంటూ న్యాయవాది గతంలో కోర్టులో కేసు వేశారు. ఉత్తర్ ప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు, దర్గా సలీం చిస్తీ, జామా మసీదు నిర్వహణ కమిటీలు దీంట్లో ప్రతివాదులుగా ఉన్నారు. ఆస్తాన్ మాతా కామాఖ్య, ఆర్య సంస్కృతి పరిరక్షణ ట్రస్ట్, యోగేశ్వర్ శ్రీ కృష్ణ కల్చరల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ట్రస్ట్, క్షత్రియ శక్తిపీఠ్ వికాస్ ట్రస్ట్, న్యాయవాది అజయ్ ప్రతాప్ సింగ్ ఈ కేసులో వాదిదారులుగా ఉన్నారు.

Exit mobile version