Site icon NTV Telugu

Ashwini Vaishnav: తెలంగాణకు కేటాయించిన రైల్వే ప్రాజెక్ట్‌లపై కేంద్రమంత్రి కీలక ప్రకటన

Ashwinivaishnav

Ashwinivaishnav

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయించిన రైల్వే ప్రాజెక్ట్‌లపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ కీలక ప్రకటన చేశారు. తెలంగాణకు రూ. 5,337 కోట్ల విలువైన ప్రాజెక్టులు కేటాయించినట్లు తెలిపారు. యూపీఏ హయాంలో అత్యధికంగా రూ.886 కోట్ల కేటాయింపులే మాత్రమే జరిగాయని పేర్కొన్నారు. ఇక తెలంగాణ నుంచి మరిన్ని వందే భారత్‌ రైళ్లు నడుపుతామని తెలిపారు. కాజీపేట రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నామని, కొన్ని పనులకు అనుమతులు రావాల్సి ఉందని చెప్పారు. ముఖ్యమైన స్టేషన్ల పరిధిలో రక్షణ వ్యవస్థ కవచ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో 1,026 కి.మీ.మేరకు కవచ్‌ ఏర్పాటు చేస్తున్నామని… 2026లోపు దేశమంతా కవచ్‌ టెక్నాలజీ అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. సికింద్రాబాద్‌లో కవచ్‌ సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ధనిక దేశాలైన ఫ్రాన్స్, జర్మనీ‌లో కూడా “కవచ్” ఏర్పాటుకు 21 ఏళ్లు పట్టిందన్నారు. తెలంగాణ నుంచి ప్రస్తుతం ఐదు వందే భారత్‌ రైళ్లు నడుస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని రైల్వే లైన్ల విద్యుదీకరణ పనులు పూర్తైనట్లు చెప్పారు. పేద వర్గాల కోసం నమో భారత్‌ రైళ్లను నడుపుతున్నామని చెప్పారు. త్వరలో దేశమంతా దాదాపు 100 నమో భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లు తీసుకురానున్నట్లు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Masthan Sai: హీరో నిఖిల్ ఫోన్ హ్యాక్.. హార్డ్ డిస్కులో ప్రయివేటు వీడియోలు?

ఇక ఈ బడ్జెట్‌లో ఏపీకి రూ. 9,417 కోట్ల విలువైన ప్రాజెక్టుల కేటాయింపులు జరిగాయని తెలిపారు. యూపీఏ హయాంలో కంటే ఏపీకి 11 రెట్లు అధికంగా నిధులు కేటాయుంపులు జరిగాయని చెప్పారు. ఏపీలోని మొత్తం అములవుతున్న రైల్వే ప్రాజెక్టులు రూ. 84,559 కోట్లు అని తెలిపారు. కొత్త ప్రాజెక్టులు ఓ పద్ధతిలో శాస్త్రీయమైన రీతిలో కేటాయింపులు జరుగుతున్నాయన్నారు. కొత్త ప్రాజెక్టులను బడ్జెట్‌లో ప్రకటించడం లేదని చెప్పారు.

ఇది కూడా చదవండి: Cremation dispute: తండ్రి అంత్యక్రియలపై వివాదం.. మృతదేహం సగం కోసి ఇవ్వాలని కొడుకు డిమాండ్..

Exit mobile version