ధాన్యం కొనుగోళ్ల విషయంలో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆరోపణపర్వం కొనసాగుతూనే ఉంది… రాష్ట్రాలను కేంద్రం తప్పుబడుతుంటే.. తప్పంతా కేంద్రానిదే అంటున్నాయి తెలంగాణ సహా పలు రాష్ట్రాలు.. అయితే, ఈ నేపథ్యంలో బాయిల్డ్ రైస్‌పై మరోసారి తన విధానాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పేసింది కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాల నుంచి బాయిల్డ్ రైస్ సేకరించేది లేదని లోక్‌సభలో స్పష్టం చేసింది కేంద్రం.. ఎంపీ దుష్వంత్ సింగ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి లిఖిత పూర్వక సమాధానం ఇస్తూ.. అవసరాల రీత్యా రాష్ట్రాలే బాయిల్డ్ రైస్ సేకరించాలని సలహాఇచ్చారు.. కానీ, కేంద్రం మాత్రం సేకరించేది లేదని తేల్చేశారు.. బాయిల్డ్ రైస్ సేకరించబోమని గత ఖరీఫ్‌లోనే స్పష్టంగా చెప్పామని ఈ సందర్భంగా గుర్తుచేసిన ఆమె.. 2020-21 ఖరీఫ్‌లో 47.49 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్‌ను, 6.33 లక్షల మెట్రిక్ టన్నుల రా రైస్‌ను సేకరించామని వెల్లడించారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వార్ నడుస్తుండగా.. కేంద్ర మంత్రి ప్రకటన అగ్గికి ఆజ్యంపోసినట్టుగా తయారైంది.
Read Also: Imran Khan: తగ్గేదేలే.. చివరి బంతి వరకూ పోరాటం..
