దేశంలో మరో కొత్త సెమీకండక్టర్ల యూనిట్ ఏర్పాటు చేసేందుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. బుధవారం ప్రధాని మోడీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం అయింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్‌లోని జెవార్ విమానాశ్రయం సమీపంలో రూ.3,706 కోట్లతో ఆరో చిప్ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. యమునా ఎక్స్‌ప్రెస్‌వే ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ అథారిటీలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా 2 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. హెచ్‌సీఎల్, ఫాక్స్‌కాన్ సంయుక్త భాగస్వామ్యంతో ఈ యూనిట్ ఏర్పాటు చేయనున్నారు.
ఇది కూడా చదవండి: CPI Narayana: కేంద్ర నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలం..! ఆ ఉగ్రవాదులను అప్పగించాకే పాక్‌తో చర్చలు జరపాలి..!
మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఆటోమొబైల్‌లు, కంప్యూటర్‌లు మరియు ఇతర డిస్పేలు ఉన్న పరికరాలకు అవసరమైన “డిస్‌ప్లే డ్రైవర్ చిప్”లు తయారీకి ఈ యూనిట్ ఏర్పాటు చేయనున్నారు. ప్రతి నెల 20,000 “వెఫర్లు” ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంటుంది. నెలవారీగా 36 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేయనున్నారు. ఇప్పటికే దేశంలో ఐదు సెమీకండక్టర్లు ఉన్నాయి. ఇది ఆరో యూనిట్.
ఇది కూడా చదవండి: AP Liquor Scam: గోవిందప్ప బాలాజీ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు!
