Site icon NTV Telugu

Ashwini Choubey: మీడియా ముందు బోరున విలపించిన కేంద్రమంత్రి అశ్వినీ చౌదరి..

Ashwini Choubey

Ashwini Choubey

Union Minister Ashwini Chaubey broke down in tears: కేంద్రమంత్రి, బీజేపీ నేత అశ్వినీ చౌబే మీడియా ముందు భోరున విలపించారు. సోమవారం చనిపోయిన బీజేపీ నేత పరుశురామ్ చతుర్వేదిని గుర్తు చేసుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. ఆయన మరణంతో తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. బీజేపీ నాయకుడు, కిసాన్ మోర్చా నాయకుడు పరుశురామ్ చతుర్వేదికి పాట్నాలో సంతాపాన్ని తెలుపుతూ విలేకరుల సమావేశం జరిగింది. ఆ సమావేశంలో కేంద్రమంత్రి అశ్వినీ చౌబే ఆయన కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. పక్కన ఉన్నవాళ్లు ఓదార్చే ప్రయత్నం చేసినా.. కన్నీళ్లు దిగమింగుకోలేకపోయారు.

Read Also: Viral Video: మీ జీవితం ఇంతకంటే కష్టమైనదా.. గుండెలను పిండేస్తున్న వీడియో

బీహార్ లోని బక్సర్ లో నిరసన తెలుపుతున్న రైతులపై పోలీసుల హింసకు వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన ‘జన్ ఆక్రోశ్ యాత్ర’లో చతుర్వేది సోమవారం గుండెపోటుతో మరణించారు. గత మూడు రోజులుగా చలికి రైతులకు మద్దతుగా నిరాహారదీక్షలో నాతో ఉన్న నా తమ్ముడు మరణించినట్లు ఇప్పుడే వార్త అందిందంటూ చౌబే ఉద్వేగానికి లోనయ్యారు. చౌసా పవర్ ప్లాంట్ కోసం తమ భూమిని సేకరించినందుకు బక్సర్ లోని రైతులు మూడు నెలల పాటు నిరసన తెలుపుతున్నారు. తమపై దాడి జరుగుతున్న పోలీసులు చర్యలు తీసుకోలేదని బక్సర్ ఎంపీ ఆరోపించారు. దీనిపై బీహార్ డీజీపీకి లేఖ రాశారు.

తనపై దాడి చేసిన ముగ్గురిని బీహార్ ప్రభుత్వ ఒత్తిడితో విడుదల చేశారని.. నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదని బీహార్ సీఎం నితీష్ కుమార్ ను ప్రశ్నించారు. అంతకుముందు భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ తికాయత్ బక్సర్ ప్రాంతాన్ని సందర్శించి జనవరి 20 లోగా సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని గుండారాజ్ గా పేర్కొంది బీజేపీ.

Exit mobile version