Union Minister Anurag Thakur criticizes Delhi CM Kejriwal in liquor scam: బీజేపీ, ఆప్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఏ1గా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అని సీబీఐ ఎఫ్ఐఆర్ లో పేర్కొంది. మరో 15 మందిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది సీబీఐ. ఈ వ్యవహారంపై బీజేపీ, ఆప్ నాయకులు విమర్శలు ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ శనివారం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిఫ్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read Also: Vivek Agnihotri: కరీనా కపూర్‌కి దర్శకుడు స్ట్రాంగ్ కౌంటర్
లిక్కర్ స్కామ్ కేసులో మనీష్ సిసోడియా ఏ 1 కావచ్చు.. కానీ కింగ్ పిన్ మాత్రం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాలే అని ఆరోపించారు. అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ఈ స్కామ్ బయటపడిన తర్వాత మనీష్ సిసోడియా అతని ముఖంలో రంగు ఎలా మారిపోయిందో స్పష్టంగా కనిపిస్తుందని.. మీడియా అడిగిన ఏ ప్రశ్నకు కూడా అతడు సరిగ్గా సమాధానం ఇవ్వలేదని.. అన్నారు. మద్యం పాలసీ మంచిదైతే వెనక్కి ఎందుకు తీసుకున్నారని..మద్యం వ్యాపారులపై మెతక వైఖరి ఎందుకని.. ఢిల్లీ సీఎం 24 గంటల్లో దేశం ముందుకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు అనురాగ్ ఠాకూర్. మనీష్ సిసోడియా తన పేరు స్పెల్లింగ్ ను ‘‘ మని ష్’’(M O N E Y SHH)గా మార్చుకొవాలని..ఎందుకంటే అతను డబ్బులు సంపాదించి మౌనంగా ఉంటారని విమర్శించారు.
మరోవైపు 2024లో లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ, అరవింద్ కేజ్రీవాల్ మధ్య జరుగుతాయని సిసోడియా చేసిన వ్యాఖ్యలపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. 2024లో అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపక్షాల పీఎం అభ్యర్థి అయితే బీజేపీకే మంచిదని.. మరింత మెజారిటీతో గెలుస్తానమి ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవల రోహింగ్యాల విషయంలో కూడా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆప్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అక్రమంగా భారత్ లోకి వచ్చిన రోహింగ్యాలకు ఉచిత నీరు, ఉచిత విద్యుత్, రేషన్ ఇస్తున్నారని.. విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.
