NTV Telugu Site icon

Delhi: అమిత్ షాను కలిసిన కోల్‌కతా వైద్యురాలి తల్లిదండ్రులు

Kolkatadacotrcase

Kolkatadacotrcase

కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోల్‌కతా వైద్యురాలి తల్లిదండ్రులు కలిశారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు అవకాశం ఇవ్వాలంటూ బాధిత కుటుంబ సభ్యులు లేఖ రాశారు. బుధవారం కలిసేందుకు అనుమతి రావడంతో బాధితురాలి తల్లిదండ్రులు.. అమిత్ షాను కలిసి తమ సమస్యలను చెప్పుకున్నారు. భేటీ అనంతరం బాధితురాలి తండ్రి మీడియాతో మాట్లాడారు. అమిత్ షాను కలిసి తమ గోడు చెప్పుకున్నట్లు పేర్కొన్నారు. కోల్‌కతా కేసు విషయాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారన్నారు.

ఆగస్టు 9న కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ వైద్యురాలు అత్యంత ఘోరంగా హత్యాచారానికి గురైంది. అనంతరం ఆగస్టగు 10న సివిల్ వాలంటీర్ సంజయ్ రాయ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తు సరిగ్గా లేకపోవడంతో కోల్‌కతా హైకోర్టు.. దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. చివరికి దర్యాప్తు సంస్థ కూడా సంజయ్‌రాయ్‌ను నిందితుడిగా పేర్కొంది. అతడు ఒక్కడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేల్చింది. అలాగే ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్, పోలీస్ ఆఫీసర్‌ పేరు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ఇక ఈ కేసు విచారణ ఈనెల 11న జరగనుంది. సంజయ్‌రాయ్‌పై కోర్టు అభియోగాలు మోపింది.

ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. వైద్యులు విధులు బహిష్కరించి ఆందోళనలు, నిరసనలు చేపట్టారు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి వారితో చర్చలు జరిపింది. ప్రస్తుతం వైద్యులు.. విధుల్లో పాల్గొన్నారు. తమకు భద్రత కల్పించాలని డాక్టర్లు డిమాండ్ చేశారు.