Site icon NTV Telugu

Health Warning: జిలేబీ, సమోసాపై వార్నింగ్ లేబుల్స్.. కేంద్రం క్లారిటీ

Samosa

Samosa

భారతీయులకు అత్యంత ఇష్టమైన ఆహారాల్లో జిలేబీ, సమోసాలు, లడ్డూలు ఉంటాయి. కొన్ని రాష్ట్రాల్లో చాలా ఫేమస్ కూడా. అలాంటి ఆహార పదార్థాలు ఆరోగ్యానికి హానికరం అంటూ కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించిందంటూ వార్తలు హడావుడి చేశాయి. సిగరెట్ పెట్టెలపై ఆరోగ్యానికి హానికరం అని రాసినట్లుగా ఆహార పదార్థాలపై కూడా వార్నింగ్ లేబుల్స్ రాసేందుకు కేంద్రం సిద్ధపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియా వేదికగా ఈ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ అప్రమత్తం అయింది.

ఇది కూడా చదవండి: Mohammed Siraj: ఫలితానికే కాదు… గుణపాఠాల కోసం గుర్తుండిపోతాయి కొన్ని మ్యాచ్‌లు.. సిరాజ్ ఎమోషనల్ పోస్ట్..!

ఈ మేరకు పీబీఐ ఓ ప్రకటనను విడుదల చేసింది. సమోసా, జిలేబీ, లడ్డూతో పాటు ఇతర ఆహార పదార్థాలకు వార్నింగ్‌ లేబుల్స్‌ అంటించే నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేసింది. జాతీయ మీడియా కథనాలను జత చేసింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సాధారణ ఆరోగ్య సలహా మాత్రమే ఇచ్చినట్లు కేంద్రం వివరణ ఇచ్చింది. ఎలాంటి ఆహార పదార్థాలను లక్ష్యంగా చేసుకోలేదని.. చక్కెర, నూనె శాతాలను తగ్గించాలంటూ బోర్డులు పెట్టాలంటూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. మెట్లు ఎక్కడం, వాకింగ్‌, పండ్లు, కూరగాయలు, తక్కువ కొవ్వు ఉన్న ఆరోగ్యకరమైన భోజన పదార్థాలను తినాలని సూచించినట్లుగా తెలిపింది.

 

Exit mobile version