Site icon NTV Telugu

AI Mission: భారత AI మిషన్ కోసం రూ. 10,372 కోట్లు.. ఆమోదం తెలిపిన క్యాబినెట్..

Ai

Ai

AI Mission: ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు కృత్రిమ మేధ(AI) టెక్నాలజీపై దృష్టిసారించాయి. భవిష్యత్ కాలంలో టెక్ రంగాన్ని ఏఐ శాసిస్తోందని చెబుతున్నాయి. ఇప్పటికే పలు టెక్ దిగ్గజాలు ఏఐ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ కూడా ఈ రంగంపై ఆసక్తి చూపిస్తోంది.

భారతదేశంలే AI అభివృద్ధికి సంపూర్ణ పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో, కేంద్ర మంత్రివర్గం గురువారం రూ.10,372 కోట్లతో AI మిషన్‌ను ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. అభివృద్ధి చెందుతున్న ఈ రంగంలో యువకులను ఎడ్యుకేట్ చేయడం, ఇన్నోవేషన్ సెంటర్లను ప్రారంభించడం, కంప్యూట్ కెపాసిటీని సృ‌ష్టించడం వరకు ఎండ్ టూ ఎండ్ స్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం ఈ మిషన్ ఉద్దేశం. ప్రతీ పౌరుడికి సాంకేతిక ప్రజాస్వామ్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ప్రధాని నరేంద్రమోడీ దార్మనికతకు అనుగుణంగా ఈ మిషన్ ఉంటుందని, దానికి అనుగుణంగా రూ. 10,372 కోట్ల మూలధన వ్యయంతో ఈ మిషన్‌ని క్యాబినెట్ ఆమోదించినట్లు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు.

Read Also: Radhika Marchant : రాధిక మర్చంట్ ధరించిన ఈ డ్రెస్సును రెడీ చెయ్యడానికి ఎన్నినెలలు పట్టిందో తెలుసా?

ఏఐ మిషన్ స్టార్టప్ అవసరాలను తీర్చడానికి ఈ రంగంలో పరిశోధనలను ప్రోత్సహించడానికి 10,000 కంటే ఎక్కువ ప్రాసెసింగ్ యూనిట్ల(GPU) కంప్యూట్ కెపాసిటీని రూపొందించేందుకు ప్రభుత్వ-ప్రైవేట్ రంగాలు సహకరిస్తాయని అధికార ప్రకటన తెలియజేసింది. మల్టిపుల్ డేటా మోడల్స్‌తో పనిచేయగల వ్యవసాయం, ఆరోగ్యం వంటి కీలక రంగాల్లో సహాయపడే లార్జ్ మల్టీ మోడల్స్‌ని అభివృద్ధి చేయడానికి AI ఇన్నోవేషన్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయబడనున్నాయి. AI నైపుణ్యం వ్యాప్తిలో భారతదేశం మొదటి స్థానంలో ఉందని, అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పీహెచ్‌డీ స్థాయిలలో ఈ విభాగంలోని కోర్సులు సులభతరం చేయబడతాయని, టైర్-2, టైర్-3 నగరాల్లో ఫౌండేషన్ స్థాయి కోర్సులను అందించేందుకు 200 AI మరియు డేటా ల్యాబ్‌లు ఏర్పాటు చేయబడనున్నాయి.

Exit mobile version