Gold rates drop: బంగారం, వెండి ధరలు దిగొస్తున్నాయి. ఈ రోజు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2024-25లో బంగారం, వెండిపై దిగుమతి సుంకాలు తగ్గించారు. దీంతో పుత్తడి ధరలపై బడ్జెట్ ఎఫెక్ట్ చూపిస్తోంది. బంగారం, వెండి వంటి లోహాలపై కేంద్రం 6 శాతానికి కస్టమ్ డ్యూటీని తగ్గించింది. దీంతో మంగళవారం MCX(మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్)లో బంగారం ధర 10 గ్రాములకు రూ. 72,838 నుంచి ఇంట్రాడేలో రూ. 68,500 వద్ద కనిష్ట స్థాయికి చేరుకుంది. వెంటి మార్కెట్‌లో MCX ధర కిలోకు రూ. 88,995 వద్ద ఉంది. ఈ రోజు ఇది రూ. 84,275 వద్ద కనిష్ట స్థాయికి చేరుకుంది.
Read Also: China: చైనా మాయలో చిక్కుకున్న మరోదేశం..భారత్ కు పొంచి ఉన్న ముప్పు !
భారతీయులకు బంగారంతో భావోద్వేగ సంబంధాన్ని కలిగి ఉన్నారని, బంగారంపై కస్టమ్ డ్యూటీని 6 శాతంకి తగ్గించడాన్ని పలువురు స్వాగతిస్తున్నారు. 6 శాతానికి దిగుమతి సుంకం తగ్గించడం ద్వారా దేశీయ ధరల్లో క్షీణతకు దారి తీయవచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. దీని వల్ల డిమాండ్ పెరిగే అవకాశం ఉందన్నారు. బంగారం, వెండిపై ప్రస్తుతం ఉన్న సుంకం 15 శాతం. దీంట్లో 10 శాతం బెసిక్ కస్టమ్ డ్యూటీ, 5 శాతం అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ సెస్ ఉంటుంది. ప్రస్తుతం బెసిక్ కస్టమ్ డ్యూటీలో 10 శాతాన్ని 6 శాతానికి తగ్గించారు. మొత్తం చూస్తే దిగుమతి సుంకం..11 శాతానికి చేరుకుంది. దీని ఫలితంగా MCXలో బంగారం ధర రూ. 4000 కంటే ఎక్కువ తగ్గి రూ. 68,500కి, వెండి ధర రూ. 2500 నుండి రూ. 84,275కి చేరుకుంది.
హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ఏకంగా రూ.2990 తగ్గి, రూ. 70,860కి చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.2750 తగ్గి, రూ. 64,950కి చేరింది. వెండి ధర కిలోకి రూ. 3500 తగ్గి, రూ.88,000కి చేరింది.