NTV Telugu Site icon

Bangladesh Protest: బంగ్లాదేశ్‌లో హింస.. రెండు రైళ్లు రద్దు చేసిన భారత్..

Kolkata Dhaka Maitree Express

Kolkata Dhaka Maitree Express

Bangladesh Protest: రిజర్వేషన్లపై బంగ్లాదేశ్‌లో నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు 50 మంది మరణించినట్లు తెలుస్తోంది. చాలా ప్రాంతాల్లో నిరసనకారులు గవర్నమెంట్, ప్రైవేట్ ఆస్తులకు నిప్పుపెట్టి, ధ్వంసం చేస్తున్నారు. 1971 బంగ్లాదేశ్ స్వాతంత్య్రంలో పాల్గొన్న వారి వారసులకు ప్రభుత్వం ఉద్యోగాల్లో ఇచ్చే 30 శాతం కోటాను వ్యతిరేకిస్తూ ఆ దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. పలు వర్సిటీల విద్యార్థులతో పాటు ప్రజలు ఆందోళనల్లో పాల్గొంటున్నారు. ఈ పద్ధతిని తీసేసి, అర్హులైన మెరిట్ కలిగిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

Read Also: Domestic violence: ఫ్రెండ్స్ ముందు బట్టలు విప్పాలని భార్యపై వేధింపులు..

ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య నడిచే రెండు రైళ్లను భారత్ రద్దు చేసింది. శనివారం కోల్‌కతా-ఢాకా మైత్రీ ఎక్స్‌ప్రెస్‌ను, ఆదివారం కోల్‌కతా – ఖుల్నా మధ్య బంధన్ ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేసినట్లు ప్రకటించింది. అనివార్య పరిస్థితుల కారణంగా 13108 కోల్‌కతా-ఢాకా మైత్రీ ఎక్స్‌ప్రెస్ శనివారం కూడా రద్దు చేయబడుతుందని తూర్పు రైల్వే అధికారి తెలిపారు. బోగీల లభ్యతపై అనిశ్చితి ఏర్పడటంతో 13129/13120 కోల్‌కతా-ఖుల్నా బంధన్ ఎక్స్‌ప్రెస్ సేవలు ఆదివారం రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.