ఢిల్లీ పేలుడు వెనుక ఉన్న కుట్ర వీడుతోంది. దర్యాప్తు సంస్థలు చాలా సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నాయి. తాజాగా ఉగ్రవాది డాక్టర్ ఉమర్ కొనుగోలు చేసిన మూడు కార్ల దృశ్యాలు అల్-ఫలాహ్ యూనివర్సిటీ సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. దేశ వ్యాప్త దాడుల్లో భాగంగా ఉమర్ మూడు కార్లు కొనుగోలు చేశాడు. హ్యుందాయ్ ఐ20, ఎరుపు రంగు ఫోర్డ్ ఎకోస్పోర్ట్, మారుతి బ్రెజ్జాలను కొనుగోలు చేశాడు. ఈ మూడు కారుల్లో ఒకటి సోమవారం సాయంత్రం ఎర్రకోట దగ్గర హ్యుందాయ్ i20 కారు పేలిపోయింది. ఇక రెండో ఎరుపు రంగు కారును బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ రిజిస్ట్రేషన్ నంబర్ 0458 కలిగిన ఎకోస్పోర్ట్‌ను హర్యానాలోని ఖండవాలి గ్రామంలో ట్రాక్ చేశారు. తాజాగా మూడో కారును అల్-ఫలాహ్ యూనివర్సిటీ లోపల పార్కింగ్ చేసి ఉన్నట్లుగా దర్యాప్తు అధికారులు గుర్తించారు. దీంతో ఉమర్ కొనుగోలు చేసిన మూడు కార్లు గుర్తింపబడ్డాయి.
ఇది కూడా చదవండి: Delhi Car Blast: 17వ నెంబర్ భవనం.. రూమ్ నెం.13.. ఢిల్లీ బ్లాస్ట్ వెనుక ఉన్న మిస్టరీ
తాజాగా ఉమర్ బంధువు ఫహీమ్‌ను అరెస్ట్ చేశారు. అతడు ఇచ్చిన సమాచారంతో మూడో కారు గుర్తింపబడినట్లు తెలుస్తోంది. ఇక ఈ కుట్రలో ఫహీమ్ పాత్రపై కూడా దర్యాప్తు అధికారులు విచారిస్తున్నారు. పేలుడు పదార్థాలు రవాణా చేయడానికి ఎక్కువగా ఎకోస్పోర్ట్ కారును ఉపయోగించినట్లుగా నిఘా సంస్థలు భావిస్తున్నాయి. ఉమర్.. అతని అనుచరులు పలుమార్లు అమ్మోనియం నైట్రేట్‌ను రవాణా చేసినట్లుగా కనిపెట్టారు. ప్రస్తుతం ఆ దిశగా దర్యాప్తు జరుగుతోంది.
ఇది కూడా చదవండి: Bihar Elections: రేపే బీహార్ ఫలితాలు.. ‘టైగర్ జిందా హై’తో వెలసిన పోస్టర్లు
