Site icon NTV Telugu

Ukraine Crisis : భారత్‌ మద్దతు కోరిన ఉక్రెయిన్ అధ్యక్షుడు

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది.. రష్యా భీకర దాడులతో ఉక్రెయిన్‌ అట్టుడికిపోతోంది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ నగరాన్ని స్వాధీనం చేసుకునే పనిలో రష్యా దళాలు పడిపోయాయి .. అధ్యక్ష భవనాన్ని కూడా చుట్టుముట్టాయి.. ఇదే సమయంలో.. వరుస వీడియోలు విడుదల చేస్తూ.. ఆయుధాలు వీడొద్దు అంటూ పిలుపునిస్తున్నారు.. ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. మొదటి వీడియోలో తాను ఇక్కడే ఉన్నాను.. పోరాడుతాం.. ఉక్రెయిన్‌ను కాపాడుకుంటాం.. ఆయుధాలు కావాలని పేర్కొన్న ఆయన.. ఇక, రెండో వీడియోలో ఏకంగా కీవ్‌ వీధుల్లో తిరుగుతూ వీడియో పోస్ట్‌ చేశారు.. ఆయుధాలు వీడొద్దు అని కోరారు.. ఇదిలా ఉంటే.. తాజాగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భారత్‌ మద్దతు కోరారు. ఈ నేపథ్యంలో భారత ప్రధాని మోడీకి ఫోన్‌ చేసి.. రష్యా దాడులు ఆపేలా చర్యలు తీసుకోవాలని మోడీని జెలెన్‌స్కీ కోరినట్లు తెలుస్తోంది.

Exit mobile version