Site icon NTV Telugu

Puri Jagannath Temple: ఆలయానికి 250 కోట్లు విరాళమిచ్చిన ఒడిశా ఎన్నారై

Puri Jagannath Temple

Puri Jagannath Temple

Puri Jagannath Temple: ఒడిశాలోని పూరీ జగన్నాథ స్వామి దేవాలయం దేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఆ గుడిలో జరిగే రథోత్సవం ఎంత ప్రసిద్ధమో మనకు తెలుసు. ఈ ఆలయ వార్షిక రథోత్సవంలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. దేశంలోని కొన్ని ప్రాంతాలలో జగన్నాథ ఆలయాలు ఈ విధంగా నిర్మించబడ్డాయి. పూరీ తరహాలోనే తెలంగాణ రాష్ట్రంలోనూ జగన్నాథ దేవాలయం ఉంది. అయితే వాటన్నింటిని మించిపోయే భారీ ఆలయం త్వరలో సిద్ధమవుతుంది. కాకపోతే అది మన దేశంలో కాదండోయ్ విదేశాల్లో.

బ్రిటన్‌లో తొలి జగన్నాథ ఆలయ నిర్మాణం జరుగుతోంది. రూ. వందల కోట్లతో నిర్మిస్తున్నారు. లండన్ శివారులో నిర్మించనున్న ఈ ఆలయం కోసం స్థానికులంతా కలిసి శ్రీ జగన్నాథ సొసైటీ యూకే (ఎస్ జేఎస్ యూకే) అనే సొసైటీని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సొసైటీ దేశవ్యాప్తంగా ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తోంది. ఈ నేపథ్యంలో ఒడిశాకు చెందిన ప్రవాస భారతీయుడు బిశ్వనాథ్ పట్నాయక్ రూ.కోటి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆలయ నిర్మాణానికి 250 కోట్లు. విదేశాల్లో ఆలయ నిర్మాణానికి ఇంత పెద్ద మొత్తంలో విరాళం రావడం ఇదే తొలిసారి. శ్రీ జగన్నాథ సొసైటీ యూకే పేరుతో ఏర్పాటైన కమిటీ అక్షయ తృతీయ నాడు ఆలయ నిర్మాణ పనులను ప్రారంభించింది. ఈ వేడుకకు బిశ్వనాథ్‌ను కూడా ఆహ్వానించారు. భూరి విరాళం బిశ్వనాథ్ పట్నాయక్ వృత్తి రీత్యా UKలో స్థిరపడ్డారు. అతను లండన్‌లోని ఫిన్నెస్ట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వ్యవస్థాపక చైర్మన్.

ఇదిలా ఉంటే లండన్ శివారులో దాదాపు 15 ఎకరాల్లో ఈ ఆలయాన్ని నిర్మించనున్నారు. SJSUK 2024 చివరి నాటికి ఆలయ మొదటి దశ నిర్మాణ పనులను పూర్తి చేయాలని యోచిస్తోంది. శ్రీ జగన్నాథ్ సొసైటీ UK ఛైర్మన్ డాక్టర్ సహదేవ్ స్వైన్ మాట్లాడుతూ, ఈ ఆలయం యూరప్‌లో జగన్నాథ సంస్కృతికి కేంద్రంగా మారుతుందని అన్నారు. వేలాది మంది భక్తులు, పర్యాటకులను ఆకర్షిస్తూ ప్రముఖ పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతామని విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా, బ్రిటన్ ప్రధాని రిషి సునక్ తన ఎన్నికల ప్రచారంలో జగన్నాథ స్వామి ఆలయాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.
PM Modi: ప్రకాశ్‌ సింగ్ బాదల్‌కి ప్రధాని మోడీ నివాళి

Exit mobile version