S Jaishankar: భారత విదేశాంగ మంత్రి ఎస్ జై శంకర్ లండన్ పర్యటనలో తీవ్ర భద్రతా వైఫల్యం ఎదురైంది. ఖలిస్తానీ అనుకూల వర్గాలు జైశంకర్ వైపు దూసుకు రావడం సంచలనంగా మారింది. బుధవారం రాయల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ అఫైర్స్‌లో ఇంటరాక్టివ్ సెషన్ తర్వాత మిస్టర్ జైశంకర్ చాథమ్ హౌస్ నుండి బయటకు వచ్చినప్పుడు, ఒక ఖలిస్తానీ అనుకూల నిరసనకారుడు బారికేడ్లను దాటి, జైశంకర్ వైపుగా వచ్చి, భారత వ్యతిరేక నినాదాలు చేశారు.
Read Also: Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు ఊరట.. ఆ మూడు కేసుల్లో నిర్దోషిగా తేల్చిన కోర్టు..
అయితే, ఈ ఘటనపై యూకే స్పందించింది. తమ పోలీసులు వేగంగా చర్య తీసుకున్నారని బ్రిటన్ పేర్కొంది. బెదిరించే ప్రయత్నం చేసే ఏ ప్రయత్నమైనా ఆమోదయోగ్యం కాదని హెచ్చరించింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు యూకే విదేశాంగ కార్యాలయ వర్గాలు తెలిపాయి. మరోవైపు, ఈ ఘటనపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. ఆతిథ్య ప్రభుత్వం తమ దౌత్య బాధ్యతలను పూర్తిగా నిర్వహిస్తుందని ఆశిస్తున్నట్లు భారత్ పేర్కొంది. ఖలిస్తానీలను ప్రస్తావిస్తూ, ఆ శక్తులు ప్రజాస్వామ్య స్వేచ్ఛలను దుర్వినియోగం చేయడాన్ని ఖండించింది.
ఖలిస్తానీ శక్తులు యూకేలో రెచ్చిపోతున్నారు. ఈ శక్తులు భద్రతా ఉల్లంఘటనకు పాల్పడటం ఇది మొదటి సంఘటన కాదు. మార్చి 2023లో లండన్ లోని భారత హైకమిషన్ వద్ద ఖలిస్తానీ శక్తులు జాతీయ జెండాను కాల్చివేశాయి. దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఈ సంఘటన తర్వాత భారత్ ఢిల్లీలోని అత్యంత సీనియర్ బ్రిటన్ దౌత్యవేత్తను పిలిపించి, తీవ్రంగా మందలించింది. బ్రిటన్ గడ్డపై పనిచేస్తున్న ఖలిస్తానీ శక్తులపై చర్యలు తీసుకోవాలని భారత్ యూకేని కోరింది.