Site icon NTV Telugu

LPG subsidy: ఎన్నికల వేళ ఉజ్వల లబ్ధిదారులకు శుభవార్త

Gle

Gle

ఎన్నికల వేళ ఉజ్వల లబ్ధిదారులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. వంట గ్యాస్ సిలిండర్‌పై ఇస్తున్న రాయితీ గడువును మరోసారి పొడిగించింది.

ఒక్కో సిలిండర్‌పై ప్రస్తుతం రూ.300 సబ్సిడీని కేంద్రం అందిస్తోంది. ఏడాదికి 12 సిలిండర్లు వరకు ఈ రాయితీ లభిస్తుంది. మార్చి 31తో ఈ గడువు ముగిస్తుంది. అయితే గురువారం మోడీ అధ్యక్షతన భేటీ అయిన కేబినెట్‌లో ఈ రాయితీని ఏడాది పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో 10 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఖజానాపై రూ.12 వేల కోట్ల భారం పడనుందని చెప్పుకొచ్చారు.

2016లో ఉజ్వల పథకాన్ని మోడీ సర్కార్ ప్రారంభించింది. ఈ పథకం కింద మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇస్తారు.

Exit mobile version