Site icon NTV Telugu

UGC NET Exam: యూజీసీ నెట్ నోటిఫికేషన్-2022 విడుదల

Ugc Net

Ugc Net

యూజీసీ నెట్ అర్హత పరీక్ష 2022 నోటిఫికేషన్ విడుదలైంది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్టీఏ) ఈ నోటిఫికేషన్‌ను ఆదివారం నాడు విడుదల చేసింది. 2021 డిసెంబర్‌, 2022 జూన్‌ రెండు పరీక్షలకు ఒకే నోటిఫికేషన్‌ను ఎన్టీఏ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించింది. మే 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు ఎన్టీఏ వెల్లడించింది. మొత్తంగా 82 సబ్జెక్టులకుగానూ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) పద్ధతిలో నిర్వహించే పరీక్షకు సంబంధించి అడ్మిట్‌ కార్డుల డౌన్‌ లోడింగ్‌ సహా, పరీక్షా తేదీలను ఇప్పటి వరకు ఖరారు చేయలేదు.

అయితే ఆయా తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని ఎన్టీఏ తన వెబ్‌సైట్‌ ద్వారా వెల్లడించింది. యూజీసీ నెట్ పరీక్షలో మంచి స్కోర్‌ సాధిస్తే జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీపడే అవకాశం ఉంటుంది. దరఖాస్తుల సహా ఇతర వివరాల కోసం అభ్యర్థులు http://ugcnet.nta.ac.in వెట్‌సైట్‌ను సంప్రదించవచ్చు.

COVID vaccine: చిన్నారులకు వ్యాక్సినేషన్‌లో ట్విస్ట్..!

Exit mobile version