దేశవ్యాప్తంగా ఎంతో సంచలనం రేపిన ఉదయ్ పూర్ ఘటనలో ఎన్ఐఏ మరో నిందితుడిని అరెస్ట్ చేసింది. టైలర్ కన్హయ్యలాల్ హత్య చేసిన కేసులో ఇప్పటి వరకు ఏడుగురిని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. నిందితుడు ఫర్హాద్ మహ్మద్ షేక్ అలియాస్ బాబ్లాను శనివారరం సాయంత్రం అరెస్ట్ చేశారు. కన్హయ్యలాల్ ను హత్య చేసి నిందితుల్లో ఒకడైన రియాజ్ అక్తరీకి సన్నిహితంగా ఉన్నాడని.. ఆయనను చంపే కుట్రలో పాల్గొన్నాడని ఎన్ఐఏ అధికారులు తెలిపారు.
జూన్ 28న ఇద్దరు మతోన్మాదులు తన షాపులో పనిచేస్తున్న కన్హయ్యలాల్ అనే టైలర్ ను తల నరికి దారుణంగా హత్య చేశారు. మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడనే కారణంగా ఉదయ్ పూర్ ఘటన చోటు చేసుకుంది. చంపడమే కాకుండా ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడం దేశం ఒక్కసారి ఉలిక్కిపడింది. ఈ ఘటన వెనక పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ దావత్-ఎ- ఇస్లామీతో సంబంధాలు ఉన్నాయని ఎన్ఐఏ తేల్చింది.
Read also: CM KCR Press Meet: బీజేపీ బారి నుంచి దేశాన్ని కాపాడుకుందాం
ఇదిలా ఉంటే ఈ ఘటనకు ముందు మహరాష్ట్రలోని అమరావతిలో ఇదే విధంగా ఉమేష్ కోల్హేని కూడా కొంతమంది దుండగులు హత్యచేశారు. ఈ ఘటన కూడా నుపుర్ శర్మకు మద్దతు తెలిపినందుకే జరిగింది. ప్రస్తుతం ఈ రెండు కేసులపై కుట్ర కోణాన్ని వెలుగులోకి తీసుకువచ్చేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ విచారణ జరుపుతోంది.