Site icon NTV Telugu

Pakistan Zindabad: యూపీలో ‘పాకిస్తాన్‌ జిందాబాద్‌’.. వైరల్‌గా మారిన వీడియో

Pakistan Zindabad

Pakistan Zindabad

భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అలాంటిది భారత్‌లో పాకిస్థాన్ జిందాబాద్ అనే నినాదం వినిపిస్తే ఇంకేమైనా ఉంటుందా? కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితే నెలకొంది. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో సింఘై కలాన్ గ్రామంలో ఓ వ్యక్తి తన షాపులో ‘పాకిస్తాన్ జిందాబాద్’ పాట ప్లే చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన బీజేపీ నేతలు భూటా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఇద్దరు నిందితులపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని బరేలీ ఎస్పీ రాజ్‌కుమార్ అగర్వాల్ వెల్లడించారు.

అయితే నిందితుడి తల్లి మాత్రం ఏం జరిగిందో తమకు తెలియదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన చిన్న కొడుకు తన మొబైల్ ఫోన్‌లో మతపరమైన పాటలు విన్నాడని చెబుతున్నారని… ఫోన్‌లో అలాంటి నినాదాలు ఉన్నాయని అతనికి తెలియదని చెప్తోంది. తాము ఎప్పుడూ మొబైల్ ఫోన్‌లో అలాంటి పాటలు ప్లే చేయలేదని వివరించింది. తన కుమారుడు చదువుకోలేదని.. దయచేసి తన కుమారుడిని విడుదల చేయాలని పోలీసులను వేడుకుంటోంది.

Exit mobile version